Connect with us

Convention

KTR, హరీష్ రావు, పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి లకు ATA Convention సాదర ఆహ్వానం

Published

on

Hyderabad, Telangana: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ని ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా సారధ్యంలోని ప్రతినిధి బృందం 19వ మహాసభలకు ఆహ్వానించింది. గత శనివారం ప్రత్యేకంగా కలిసి Convention ఆహ్వానాన్ని అందించారు.

అలాగే పద్మభూషణ్ (Padma Bhushan), ఫిలాంత్రపిస్ట్, మరియు శాంతా బయోటెక్ (Shantha Biotechnics) ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి (Dr. Koduru Iswhwara Varaprasad Reddy) ని కూడా కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వానించారు.

నిన్న మాజీ మంత్రి, BRS సీనియర్ నేత హరీష్ రావు (Thanneeru Harish Rao) ను కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌కు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది.

ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa) ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను హరీష్ రావు కు వివరించారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు వారి పరిస్థితుల పై చర్చించారు. పదేళ్ల BRS పాలనలో తెలంగాణ ను దేశంలో నంబర్ వన్ గా నిలిపామని అన్నారు.

ఉద్యమంలో NRI ల పాత్ర పై కూడా చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో NRI లు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడ గట్టారో వివరించారు. ఆటా మహా సభలకు (ATA Conference & Youth Convention) హాజరయ్యేందుకు హరీష్ రావు సానుకూలంగా స్పందించారు.

హరీష్ రావు ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ (American Telugu Association – ATA) అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల (Sarath Vemula), ఇండియా కో ఆర్డినేటర్ వేణు సంకినేని, ఈశ్వర్ బండా (Eshwar Banda) తదితరులు ఉన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected