Connect with us

Events

ATA @ Milwaukee, Wisconsin: వైభవంగా మహిళా దినోత్సవం & ఉగాది వేడుకలు

Published

on

Milwaukee, Wisconsin: ATA (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో 2026 మహిళా దినోత్సవం మరియు ఉగాది (Ugadi) వేడుకలు మిల్వాకీ, విస్కాన్సిన్ లో అత్యంత వైభవంగా జరిగాయి. 350 మందికి పైగా పాల్గొన్నారు. డాక్టర్ రామ బలిజ గారు, డాక్టర్ అశ్వని గారు, ప్రభాకర్ దొమ్మల గారు, శ్రావణి గారు మరియు పావని గారి చేతుల మీద దీపాలంకరణ తో ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఆనంతరం పూజారి శ్రవణ్ వూరుమడ్ల గారు ఉగాది పంచాంగం చదివి, నూతన సంవత్సర రాశి ఫలాలూ వివరించారు.

ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు లను మరియు జీవన విధానాలను డాక్టర్ అశ్వని గుండెల్లి గారు చాలా చక్కగా వివరించారు. చాలా మంది మహిళలు (Women) ఇంటి వద్ద ఉగాది పచ్చడిని తయారు చేసి, రుచికరమైన ఉగాది పచ్చడి పోటీలలో పాల్గొనడానికి కార్యక్రమానికి తీసుకువచ్చారు.

రీజినల్ కోఆర్డినేటర్లు సింధు నేతి మరియు సంతోషి వల్లూరి ఆధ్వర్యంలో పిల్లలు నృత్యాలు (Cultural Programs) మరియు మన సంప్రదాయ నాటికలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం మొత్తంలో ‘బాల రామాయణం’ నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో దాదాపు 20 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు; ఈ ప్రదర్శన కోసం గత నెల రోజులుగా సునీత గారు మరియు ప్రసాద్ యల్లపు గారు పిల్లలకు చక్కటి శిక్షణ ఇచ్చారు. వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

సంప్రదాయబద్ధమైన, రకరకాల రుచికరమైన మన తెలుగు వంటకాలు అందించినందుకు గాను, హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ (Hyderabad House Restaurant) యాజమాన్యానికి రీజినల్ డైరెక్టర్ పోలిరెడ్డి గంట మరియు రీజినల్ కోఆర్డినేటర్ జయంత్ పారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నృత్యం మరియు నాటిక ప్రదర్శన లో పాల్గొన్న వారికి ATA సర్టిఫికేట్‌ను సత్య కర్రి గారు, జగదీష్ బాదం గారు, మహేష్ బేల గారు ,ఉత్కర్ష్ రెడ్డి గారు, వివేకానంద్ కొమ్మినేని గారు, రాజా బాబు నేతి గారు, సురేష్ బెస్టా గారు పంపిణీ చేసారు.

ATA రీజినల్ అడ్వైజర్ చంద్ర మౌళి గారు రీజనల్ కోఆర్డినేటర్స్ వెంకట్ జాలరి మరియు కరుణాకర్ రెడ్డి, స్పాన్సర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. రుచికరమైన ఉత్తమ ఉగాది పచ్చడి విజేతలకు చంద్రమౌళి గారు ప్రత్యేక బహుమతిని అందించారు. రాఫిల్ టికెట్ల పోటీల విజేతలకు జయత్ పారా గారు వెండి నాణేలను, పొలిరెడ్డి గారు మహిళల హ్యాండ్‌బ్యాగు ను బహూకరించారు. ATA బోర్డు అధికారులు, ఇటీవల నిర్వహించిన ATA వేడుకల కార్యక్రమాలు మరియు తెలుగు రాష్ట్రాలలో చేపట్టిన సేవా కార్యక్రమాల సందేశాన్ని తెలియజేశారు.

కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహాయపడిన హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ (Hyderabad House Restaurant) వారి సహకారం మరియు గాయత్రి ఫుడ్స్ రాజు గారు, గోపాల్ నారాయణ స్వామి, శరత్ పువ్వాడి, రాజు పుల, సందీప్ అరికేరి, శ్రీనివాస్ నిమ్మన, హేమంత్ కొమ్మి, చండీ గారు మరియు రాఘవ్ గౌడ్, సాయి కృష్ణ, అర్జున్ సత్యవరపు, విజయ్ కిషన్ వల్లూరి, విక్రాంత్ రెడ్డి కుందురు , నసర్ రెడ్డి గంట, శశిధర్ రెడ్డి ముద్దం, పూర్ణ మేడ్ల, అవినాష్ శీలం, అమిత్ -360 డిగ్రీ ఫోటో బూత్, స్పైస్ హబ్, AI కిచెన్, MKE డెకర్స్, పోట్రియాట్ ఫోటో స్పెషలిస్ట్ దీక్షిత మేడం, కి మన ATA విస్కాన్సిన్ బృందం (ATA Wisconsin Chapter) ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected