St. Louis, Missouri: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో NRI TDP సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా NRI TDP గ్లోబల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచు వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy Chenchu) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం ఏడు రోజుల వ్యవధిలో తొమ్మిది కీలక కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు.
“మేము విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన మాతృభూమిపై మమకారం, మన రాష్ట్ర అభివృద్ధిపై బాధ్యత ఎప్పటికీ తగ్గవు. మన ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి, యువతకు మరిన్ని అవకాశాల కల్పన మా అందరి ఆకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి చెందాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, మన రాష్ట్రం మరిన్ని అవకాశాలకు కేంద్రంగా ఎదగాలి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి NRITDP St. Louis, USA తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రవాసాంధ్రులుగా మన రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో సానుకూల భాగస్వాములమవుతూ, ప్రజా సంక్షేమం కోసం మా వంతు సహకారం అందిస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటాం” అని చెంచు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచడం, మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగించడం, ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించడం ప్రవాసాంధ్రులుగా తమ బాధ్యతగా భావిస్తున్నామని NRI TDP St. Louis బృంద సభ్యులు తెలిపారు. మన ఊరు బాగుండాలి… మన రాష్ట్రం బాగుండాలి… మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వంగా నిలవాలి.