Connect with us

Financial Assistance

Telangana: నిరుపమాన దాతృత్వంతో మంచిర్యాల, బెల్లంపల్లి వాసికి Atlanta NRI శ్యామ్ పడమటింటి సాయం

Published

on

“సముద్రాల దూరం శరీరాల మధ్య దూరమే కానీ… కరుణ ఉన్న మనసులకు కాదని నిరూపించారు.” మంచిర్యాల (Mancherial), బెల్లంపల్లి కన్నలబస్తీ (Telangana) కి చెందిన విజయ్ చందర్ ప్రమాదానికి గురై, హాస్పిటల్లో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వేళ… ఒక్క సోషల్ మీడియా స్టేటస్ చూసి, దేశాలు దాటి స్పందించిన ఆపద్బాంధవుడు, పడమటింటి శ్యాంసుందర్.

ఖండంతరాల అవతల ఉన్నా, తోటి తెలుగువాడి కష్టం చూసి చలించిపోయి, తన కుమారుడు శ్రేయాష్ ద్వారా రూ. 60,000/- భారీ ఆర్థిక సహాయాన్ని (Financial Assistance) అందించి, ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు. వారు అందించిన ఈ సాయం కేవలం ధన సహాయం కాదు… అది విజయ్ చందర్‌కు పోసిన పునర్జన్మ! ఒక కుటుంబానికి ప్రసాదించిన జీవితం అని విజయ్ చందర్ కుటుంబ సభ్యులు అన్నారు.

కరుణకు నిలువెత్తు రూపం: పడమటింటి శ్యాంసుందర్ (Shyam Padamatinti), శ్రేయాష్ లాంటి గొప్ప సహృదయులు, నిరుపమానమైన దాతృత్వం ఉన్నందుకే ఈ భూమి మీద ఇంకా మానవత్వం బ్రతికి ఉంది అని విజయ్ చందర్ తండ్రి సోమశేఖర్ ఈ సందర్భంగా అన్నారు.

మానవ రూపంలో ఉన్న దైవం: రూపంలో మనిషైనా, సమయానికి మీరు చేసిన ఈ సాయంలో మేము ఆ భగవంతుడిని చూస్తున్నాం సార్. ధనమున్న వారు ఎందరో ఉండొచ్చు… కానీ దానం చేసే గుణం, స్పందించే హృదయం ఉన్న శ్యాంసుందర్ (Shyam Padamatinti) మరియు శ్రేయాష్ లాంటి మహానుభావులు కొందరే ఉంటారు.

మీ అమూల్యమైన సహాయానికి మా కుటుంబం జన్మతః రుణపడి ఉంటుంది. మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. శిరస్సు వంచి పాదాభివందనాలతో…అంటూ విజయ్ చందర్ కుటుంబ సభ్యులు క్రుతజ్ఞతలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected