Connect with us

Movies

బెట్టింగ్ కి అడిక్ట్ అయితే నీ లైఫ్ ఎగ్జిటే అంటూ “ఒక్క అద్భుతం” షార్ట్ ఫిల్మ్, యువతకి ఆత్మపరిశీలన అవసరం అంటున్న పెద్దలు

Published

on

ప్రస్తుత యువతలో పెరుగుతున్న భావోద్వేగ సంఘర్షణలు, జీవితంపై ఆశలు, నిరాశల మధ్య మనిషి చేసే ఆత్మపరిశీలనను హృద్యంగా చూపిస్తూ రూపొందిన తెలుగు షార్ట్ ఫిల్మ్ “ఒక్క అద్భుతం” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బెట్టింగ్ (Betting) జాఢ్యం ఎక్కువగా ఉంది.

జూదం (Gambling) మరియు తదనంతర ఆర్ధిక బాధలను కళ్ళకు కట్టినట్లు చూపి అందరినీ ఆలోచించేలా చేసిందీ షార్ట్ ఫిల్మ్ (Okka Adbhutham). ఇటీవల తెలుగు వన్ యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం భావోద్వేగ కథనం, సహజమైన నటన, హృదయానికి హత్తుకునే సందేశంతో మంచి స్పందనను అందుకుంటోంది.

ఈ షార్ట్ ఫిల్మ్‌లో సాధారణ జీవితంలో ఎదురయ్యే చిన్న సంఘటనలే ఎలా ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలవో ఎంతో భావోద్వేగంగా చూపించారు. కుటుంబ బంధాలు, మానవీయ విలువలు, ఆశ అనే అంశాలను ప్రధానంగా తీసుకుని దర్శకుడు (Director Vinay Kondra) కథను నడిపించిన తీరు ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.

ప్రధాన పాత్రధారుడు శ్రీక్ లావు (Srik Lavu) నటన సహజసిద్ధంగా ఉండటంతో పాటు, ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగం స్పష్టంగా ప్రతిఫలించింది. మొదటి ప్రయత్నంలోనే యూత్ ని కదిలించే అంశంతో ప్రేక్షకుల ముందుకు రావడం అభినందనీయం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే “బెట్టింగ్ కి అడిక్ట్ అయితే నీ లైఫ్ ఇంక ఎగ్జిటే” సందేశం ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉంది.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలు కూడా చిత్రానికి మరింత బలం చేకూర్చాయి. తక్కువ వ్యవధిలోనే మంచి భావాన్ని అందించిన “ఒక్క అద్భుతం” షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియా (Social Media) లో కూడా ప్రశంసలు అందుకుంటోంది. మంచి కథతో, బలమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన షార్ట్ ఫిల్మ్‌గా నిలుస్తోంది.

ఈ చిత్రాన్ని వీక్షించిన పలువురు ప్రేక్షకులు ఇట్ ఈస్ ఆ బర్నింగ్ ఇష్యూ ఇన్ యూత్, చిత్రాన్ని చక్కగా మలిచారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న యువ నటులకు, దర్శకులకు “ఒక్క అద్భుతం” (One Miracle) మంచి ప్రోత్సాహంగా నిలుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

error: NRI2NRI.COM copyright content is protected