అట్లాంటా, జాన్స్ క్రీక్ (Johns Creek, Atlanta, Georgia) లోని తాజా కేఫ్ (TAAZAA Cafe) లో మెఘన పెనుమర్తి 28వ జన్మదినోత్సవం మరియు లికిత పెనుమర్తి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో మే 30నఅత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రత్యేక వేడుకలో మెఘన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు (Birthday Celebrations) తెలియజేసి, ఆమె జీవితంలో మరెన్నో విజయాలు, సంతోషాలు చేకూరాలని ఆకాంక్షించారు.
అలాగే విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచి గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తి చేసిన లికిత పెనుమర్తి ని అభినందిస్తూ, ఆమె కృషి, అంకితభావం మరియు పట్టుదలను కొనియాడారు. కేక్ కటింగ్ (Cake Cutting), శుభాకాంక్షల సందేశాలు, స్మృతిచిత్రాల ఆవిష్కరణతో కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ రెండు విశేష సందర్భాలను సంబరంగా జరుపుకుంటూ చిరస్మరణీయ జ్ఞాపకాలను సృష్టించారు. ప్రముఖ సినీ నటి హిమజ (Actress Himaja) ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అందరూ హిమజ తో ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.
ఈ సందర్భంగా హాజరైన అతిథులు మెఘనా మరియు లికితలకు శుభాభినందనలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు మరింత విజయవంతంగా, సంతోషభరితంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అందరూ కలిసి విందును ఆస్వాదిస్తూ సంతోషకరమైన క్షణాలను పంచుకున్నారు.
తాజా కేఫ్ యజమాని, ప్రముఖ నటులు వెన్నెల రామారావు (Vennela Rama Rao) విచ్చేసిన ప్రతి ఒక్కరికీ స్వయంగా వడ్డించి, ప్రతి ఐటమ్ అందరికీ అందేలా చూడడం అభినందనీయం. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ (Vegetarian Restaurant) లో కమ్మని ఇంటి పట్టు తెలుగు భోజనం చేసినట్టుందని ఆహ్వానితులు తాజా కేఫ్ టీంని అభినందించారు.
సినీ నటి హిమజ (Actress Himaja) సైతం తన అట్లాంటా పర్యటనలో భాగంగా గత రెండు రోజులుగా తాజా కేఫ్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ లోనే తింటున్నానని, క్వాలిటీ మరియు రుచిని దృష్టిలో పెట్టుకొని 10 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తున్నానని మీడియా ముఖంగా వెల్లడించడం కొసమెరుపు.
వెన్నెల రామారావు మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి విచ్ఛేసి తమ తాజా కేఫ్ (TAAZAA Cafe) ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ లో ఆతిథ్యం స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి రోజు ఫ్రెష్ ఫుడ్ తయారుచేస్తున్నామని, ఫ్రిడ్జ్ కూడా లేదని, మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.