Connect with us

Movies

Johns Creek, Georgia: Taazaa Cafe లో సందడి చేసిన జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్

Published

on

సూపర్ హిట్ తెలుగు సినిమా ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ జార్జియాలోని (Johns Creek, Georgia) ప్రముఖ స్వచ్ఛ శాఖాహార రెస్టారెంట్ Taazaa Cafe లో సందడి చేశారు. స్నేహితులతో కలిసి కేఫ్‌ను సందర్శించిన ఆయన, అక్కడ అందించే వివిధ రకాల దక్షిణ భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపారు.

జాన్స్ క్రీక్‌లోని గణేష్ ఆలయానికి (Ganesh Temple of Atlanta) సమీపంలో ఉన్న Taazaa Cafe, సంప్రదాయ దక్షిణ భారతీయ రుచులను స్వచ్ఛమైన శాకాహార పద్ధతిలో అందిస్తూ తెలుగు, భారతీయ కుటుంబాలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆహార కేంద్రంగా గుర్తింపు పొందుతోంది.

తాజా పదార్థాలతో తయారైన టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్, పచ్చళ్లు, పోడులు వంటి ప్రత్యేక వంటకాలు ఈ కేఫ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనుదీప్ (K. V. Anudeep) సందర్శన సందర్భంగా అభిమానులు, స్నేహితులు ఆయనతో ఆత్మీయంగా ముచ్చటించి, జ్ఞాపకార్థంగా ఫొటోలు దిగారు. ఆయన రాకతో Taazaa Cafe లో సందడి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా Taazaa Cafe యాజమాన్యం (Vennela Rama Rao) మాట్లాడుతూ, ప్రముఖ సినీ దర్శకుడు అనుదీప్ (Director Anudeep) తమ కేఫ్‌ను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా తెలుగు సినీ ప్రముఖులు, ప్రవాస భారతీయులు, కుటుంబాలకు ఉత్తమమైన రుచి, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు కుటుంబాలకు (Telugu Families) ఆత్మీయ వాతావరణంలో స్వదేశీ రుచులను అందిస్తున్న తాజా కేఫ్, జార్జియాలో (Johns Creek, Georgia) భారతీయ ఆహార ప్రియులకు ప్రముఖ గమ్యస్థానంగా కొనసాగుతోంది.

error: NRI2NRI.COM copyright content is protected