Connect with us

Politics

Let’s Speak for Jagananna – విజయవంతంగా వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశం @ Dallas, Texas

Published

on

Dallas, Texas: డల్లాస్‌లో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ (Yuvajana Sramika Rythu Congress Party) ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి (Sambasiva Reddy Aluru) గారు పాల్గొని ప్రవాసాంధ్రులతో విస్తృతంగా మాట్లాడారు.

2019–2024 మధ్య జగనన్న (YS Jagan Mohan Reddy) ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలన్న జగనన్న సంకల్పం, పేదలు మరియు బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న మానవత్వం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు.

ప్రస్తుతం YCP పార్టీ చేపడుతున్న డిజిటల్ మరియు ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలైన:

  • Let’s Speak for Jagananna
  • Let’s Write for Jagananna
  • Let’s Post for Jagananna
  • Let’s Code for Jagananna

వాటి లక్ష్యాలు, కార్యకలాపాలను వివరించారు.

పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన వివిధ టెక్నాలజీ కార్యక్రమాలను ప్రవాసాంధ్రులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అధికారిక YSRCP NRI Wing Portal – www.ysrcpnriwing.org ను ప్రారంభించి, అందులోని స్టూడెంట్ అసిస్టెన్స్, జాబ్ అసిస్టెన్స్, వీసా అసిస్టెన్స్, టెక్నాలజీ సపోర్ట్, ORM సపోర్ట్ మరియు కమ్యూనిటీ కనెక్ట్ వంటి సదుపాయాలను వివరించారు.

సేవలు పొందాలనుకునేవారు మాత్రమే కాకుండా, ఇతరులకు సహాయం చేయాలనుకునే ప్రవాసాంధ్రులు (NRIs) కూడా ఈ వేదిక ద్వారా భాగస్వాములు కావచ్చని తెలిపారు. అలాగే, పార్టీ డిజిటల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన Jagan 2.0 Super App ను కూడా ప్రారంభించారు.

పార్టీ కోసం సమయం, ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం మరియు సేవా భావంతో పనిచేసే ప్రతి ఎన్ఆర్ఐ కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు, ప్రోత్సాహం మరియు ప్రశంసలు లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు జగనన్న (YS Jagan) నాయకత్వంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, పార్టీ మరియు ఎన్ఆర్ఐ వింగ్ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected