అమెరికా రాజధాని వేదికగా.. చిత్తూరు (జిల్లా), నగరి నియోజకవర్గం శాసన సభ్యులు (MLA) గాలి భాను ప్రకాష్ తో ప్రవాస తెలుగు వారి ఆత్మీయ సమావేశం (Washington D.C.) జరిగింది. ఈ కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. సభికులందరూ అన్న NTR చిత్రపటానికి పూలతో నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో ప్రవాస తెలుగు వారి పాత్ర, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి, సమర్ధ నాయకత్వం, కేంద్రప్రభుత్వ సహకారం.. ఇలా పలు అంశాల పట్ల అభిప్రాయలు, ఆలోచనలు పంచుకున్నారు. నగరి శాసన సభ్యులు భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) మాట్లాడుతూ.. తెలుగు నేలపై 2024 ఎన్నికల విజయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదన్నారు.
ఈ విజయంలో ప్రవాసుల కృషి, చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎల్లప్పుడూ ప్రస్తావిస్తుంటారు. కూటమి ప్రభుత్వం, సమర్ధ నాయకత్వంలో పలు రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లోకేష్ (Lokesh Nara) చొరవతో విద్య రంగం నూతన సంస్కరణలతో పురోగతికి ఇటీవలి పదోతరగతి ఫలితాలే నిదర్శనమన్నారు.
ప్రజాభిమానం తోడుగా నగరి నియోజకవర్గ (Nagari Assembly Constituency) ప్రజల అభ్యున్నతికి తన తండ్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు (Gali Muddu Krishnama Naidu) నుండి ఈనాటి వరకూ దశాబ్దాలుగా విలువలతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామన్నారు. 2029 ఎన్నికల విజయం లక్ష్యంగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana), సమన్వయ కర్త మాగులూరి భానుప్రకాష్ (Bhanu Maguluri), యాష్ బొద్దులూరి (Yash Bodduluri), సుధీర్ కొమ్మి మాట్లాడుతూ మాతృభూమి, మాతృబాష తమకు రెండుకళ్ళుగా ప్రవాస తెలుగు వారు పనిచేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారం, తోడ్పాటు ఎల్లప్పుడూ అందిస్తామని, ఎన్నికల్లో విజయమే నేడు జరుగుతున్న అభివృద్ధికి కొనసాగింపు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి, సత్యనారాయణరాజు, మాధవనాయుడు బోయెల్ల , ప్రదీప్ గుత్తా, సీతారామారావు యెండూరి, చంద్రనాధ్, వెంకట రెడ్డి, వెంకటేశ్వర్రావు సామినేని, అమరలింగం, సుదర్శన్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, వీరభద్రరావు, సురేష్, భిక్షపతి, శంకరరావు మరియు పలువురు ప్రవాస (NRIs) తెలుగువారు పాల్గొన్నారు.