- ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు
- తెలుగు నేలపై ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్న మన్నవ
- ఎన్టీఆర్ తెలుగుజాతికి ఆరాధ్య దైవం
- జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో ప్రారంభం
Virginia, Washington D.C.: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జినియా లో మినీ మహానాడు (Mini Mahanadu) ను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది.
ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ (NTR) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అదో సంచలనం.. ప్రజా హితమే!
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ…”తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజా హితం… సంచలనమే. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధి తో అమలుచేసిన ఘనత అన్నగారికే దక్కుతుంది. మహిళలకు ఆస్తిలో హక్కునేకాదు… రాజ్యాధికారాన్నీ కట్టబెట్టారు. మే 28…కేవలం ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు మాత్రమే కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవం మేల్కొన్న రోజు.
ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత మూడో తరం నేత నారా లోకేష్ (Nara Lokesh) టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరించడంతో ఈ సారి మహానాడు మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది” అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పొదుపు చర్యలను పాటిస్తూ… మహానాడు ను దేశానికే ఆదర్శవంతంగా తెదేపా
అధిష్టానం నిర్వహించనుందని మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు.
ప్రజలే దేవుళ్ళు… ఇదే ఎన్టీఆర్ సిద్ధాంతం
భాను మాగులూరి (Bhanu Maguluri) మాట్లాడుతూ….. “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ” అని విశ్వసించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu) దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా విస్తరింప చేసారు. లోకేష్ కొత్త తరం నాయకత్వంతో మరింత ఆధునిక దిశగా అడుగులు వేస్తున్నారు.” అని భాను పేర్కొన్నారు.
యశస్వి బొద్దులూరి (Yash Bodduluri) మాట్లాడుతూ.. తెలుగునేల ఉన్నంతవరకూ ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) చిరస్మరణీయుడు. కళా రంగాన్ని, సేవారంగానికి పునాదిగా మలచుకొని తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు.
సాయి బొల్లినేని (Sai Bollineni) మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం (Telugu Desam Party – TDP) కార్యకర్తల గుండెల్లో గూడుకట్టుకుందని, ఈనాటి లక్షలాది తెలుగు వారి ఉన్నతికి, సాంకేతిక ప్రగతికి చంద్రబాబు దార్శనికతే కారణమన్నారు. చంద్రమోహన్ బేవర, రామ్ ప్రసాద్ మైనేని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుజాతికి ఆరాధ్య దైవంగా ఎప్పటికీ పేదల, మహిళల గుండెల్లో మిగిలిపోతారన్నారు.
కార్యక్రమంలో సత్యనారాయణ మన్నే (Satyanarayana Manne), జానకిరామ్ భోగినేని, రమేష్ అవిర్నేని, కిషోర్ కంచెర్ల, పయ్యావుల చక్రవర్తి, సుశాంత్ మన్నే, ఫణి యలమంచిలి, అరుణ్ నాగ, రాజేష్ అడివి, మురళి బచ్చు, బాబు వేమన, సామినేని వెంకటేశ్వరరావు, సీతారామారావు, గోవర్ధన్, సుబ్బారావు, వెంకట రెడ్డి, చంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.