Connect with us

Politics

నంద‌మూరి రామకృష్ణ @ Denmark, Europe: తెలుగును బ‌తికించ‌డ‌మే ఎన్టీఆర్‌ కిచ్చే అతిపెద్ద నివాళి

Published

on

  • •⁠ Denmark లో పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన ప్రవాసాంధ్రులు
    •⁠ తెలుగును బ‌తికించ‌డ‌మే ఎన్టీఆర్‌కిచ్చే అతిపెద్ద నివాళి అన్న వక్తలు
    •⁠ ⁠ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద‌మూరి రామకృష్ణ, మ‌న్నవ‌ సుబ్బారావు
    •⁠ వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించిన్న మంత్రి కొల్లు రవీందర్‌, కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌

డెన్మార్క్ (Denmark, Europe) లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna), గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) పాల్గొన్నారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్‌ (Kollu Ravindra), స్వచ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మన్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌ (Kommareddy Pattabhiram) లు వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ యూరప్ (NRI TDP Europe) సమన్వయకర్త మరియు కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్ పోట్లూరి అధ్యక్షత వహించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయించాలని తెదేపా (TDP) అధిష్టానం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వక్తలు కొనియాడారు. అవినీతి, అరాచకం, విధ్వంసంతో ఏపీలో సాగిన జగన్ (YS Jagan Mohan Reddy) పాలనకు ప్రజలు చ‌ర‌మ‌గీతం పాడి…కూట‌మి సుపరిపాలన ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు (Cherukuri Ramoji Rao) ద్వితీయ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంతాపం తెలిపారు.

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు జాతికి, తెలుగు భాష‌ (Telugu Language) కు ఎన్టీఆర్ ఎన‌లేని ప్రాధాన్యత ఇచ్చేవార‌ని పేర్కొన్నారు. మాతృభాష‌ను విస్మరించిన ఏ స‌మాజ‌మైన మృత స‌మాజంగా మిగులుతుంద‌ని తెలిపారు. ఎల్లలు దాటి వేరొక‌ర దేశంలో స్థిర‌ప‌డ్డా ప్రవాసాంధ్రులు తెలుగు భాష‌ను, సంస్కృని ప‌రిర‌క్షించుకుంటున్నార‌ని కొనియాడారు. అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త ఎన్టీఆర్ (NTR) ది. మేం మ‌ద్రాసులో పుట్టినా ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడు కునే వాళ్లం.” అని రామకృష్ణ తెలిపారు.

పాలనలో విప్లవాత్మక మార్పులు తెదేపా తోనే

NDA కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి పథంలో 20 ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు. ” ప్రవాసాంధ్రులు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాల‌ని… అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు.

కూట‌మి గెలుపులో ప్రవాసాంధ్రుల కృషి ఎన‌లేనిది

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి గెలుపులో ఎన్నారైలు కీల‌క‌పాత్ర పోషించార‌ని కొల్లు ర‌వీంద్ర‌, కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ తెలిపారు. 24 నెల‌ల చంద్రబాబు (Nara Chandrababu Naidu) పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ది ప‌థంలో దూసుకుపోతోంద‌ని వివ‌రించారు. భారీగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని…గూగుల్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టడం చారిత్రాత్మకమ‌ని తెలిపారు.

కార్య‌క్ర‌మంలో డెన్మార్క్ (Denmark, Europe) తెలుగు అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు అమ‌ర్ నాథ్ పోట్లూరి మాట్లాడుతూ.. యూరప్ లో అతి పెద్ద తెలుగు సంఘం డెన్మార్క్ లో ఉందని తెలిపారు. తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూ తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు తమ పిల్లలకు చక్కటి తెలుగు నేర్పిస్తున్నామని ఆయన తెలిపారు.

చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల డెన్మార్క్ లోని ప్రవాసాంధ్రులు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిబాబు చెరుకూరి, సీతారామయ్య జాస్టి, సుధాకర్ చాగంటి, మధుబాబు నిమ్మగడ్డ, బాలకృష్ణ యాగంటి, ప్రవీణ్ జంపని తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected