అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు Andhra Pradesh American Association (AAA) మరియు Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి. ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
ప్రతి ప్రాంతీయ డైరెక్టర్‌కు (Regional Directors) ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లు
బొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్‌వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.
హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ (New Jersey), న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.
దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా (Pennsylvania), మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.
గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్‌ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు. ఆంధ్ర (Andhra Pradesh) సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా (Arizona), వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.
చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.
నాయకత్వం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యం
AAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, బలమైన నెట్‌వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్‌వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.