Connect with us

Government

London లో ఏపీ వైద్య శాఖ ఉన్నత స్థాయి బృందం పర్యటన, అంతర్జాతీయ వైద్య సహకారంపై కీలక చర్చలు

Published

on

London, నవంబర్ 17: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) గారి విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను వైద్య, ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ వీర పాండ్యన్ IAS గారి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఐదు రోజుల పాటు యూకేలో పర్యటిస్తోంది.

ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్ లో ని ప్రముఖ సంస్థలు అయిన UCL London, LSE, NHS UK, Queen Elizabeth Hospital, Imperial College London, Gates Foundation, University of Birmingham ప్రతినిధులతో సమావేశమై వైద్య విద్య, ఆధునిక వైద్య సదుపాయాలు, పరిశోధనలు, AI టెక్నాలజీ, పెట్టుబడులు, అంతర్జాతీయ వైద్య సహకారంపై చర్చలు జరుపుతున్నారు. ఈ బృందానికి కి యూరప్ ప్రత్యేక ప్రతినిధి జయకుమార్ గుంటుపల్లి గారు కోఆర్డినేట్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా లండన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, యూకేలోని తెలుగు వైద్యులు, వైద్య నిపుణులు (Medical Professionals), ప్రవాస ఆంధ్రులతో సంప్రదింపులు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య రంగ అభివృద్ధికి యూకేలోని వైద్య నిపుణుల అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం, అంతర్జాతీయ సంస్థలతో భవిష్యత్ భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమాల సమన్వయంలో యూకే ప్రవాసాంధ్రులు , ప్రముఖ బ్రిటన్ వైద్య నిపుణలు, APNRT కోఆర్డినేటర్లు తమవంతు సహకారం అందించారు. ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతను (Modern Technology) ఏపీకి తీసుకువచ్చే దిశగా ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సమావేశం లో శ్రీ వీర పాండ్యన్ గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాలసీ లు వివరించారు.

error: NRI2NRI.COM copyright content is protected