Connect with us

News

London: ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్టాల్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

Published

on

London: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదర్శన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున ప్రతినిధి బృందం పాల్గొంది. ఇన్‌క్రెడిబుల్ ఇండియా (Incredible India) బృందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక విశేషాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించింది.

ఈ కార్యక్రమంలో Europe Special Representative, Govt of AP ప్రత్యేక ప్రతినిధి జై కుమార్ గుంటుపల్లి, ఏపీఎన్ఆర్టీ (APNRT) కోఆర్డినేటర్లు వినోద్ మాదాల, పవిత్ర గుడిపాటి, రత్న శ్రీ ఉప్పల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక (Andhra Pradesh Tourism) శాఖ స్టాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక విశేషాలను, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అంశాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్టాల్‌ను అభినందిస్తూ ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక శాఖ పాల్గొంది.

అంతర్జాతీయ (International) పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, విదేశీ పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించే దిశగా డబ్ల్యూటీఎం 2026 ఒక కీలక వేదికగా నిలిచింది.

error: NRI2NRI.COM copyright content is protected