Washington D.C., USA: 2029 కూటమి గెలుపు – రాష్ట్ర ప్రగతికి మరో మలుపని గన్ని వీరాంజనేయులు (Ganni Veeranjaneyulu) అన్నారు. చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నాయకత్వంలో లో కూటమి గెలుపు భావి తరాలకు బంగారుబాటవేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి కొనసాగింపు అని రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు (ఆప్కాబ్) చైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు అన్నారు.
అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్య, వైద్యం, సాంకేతిక రంగాలలో రాష్ట్ర పురోగతి పట్టాలెక్కిందన్నారు. చంద్రబాబు, లోకేష్ (Lokesh Nara) అవిశ్రాంత కృషి వలన రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీల పెట్టుబడులు సాధ్యమయ్యారన్నారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) ఉనికి, విజయంతో ప్రవాసుల పాత్ర నిరుపమానమన్నారు. యువతకు స్ఫూర్తినందిస్తూ, ఇటీవల అమెరికాలో..అత్యంత పిన్న వయసులో ఇమ్మిగ్రేషన్ అటార్నీగా పట్టా పుచ్చుకున్న, కడపకు చెందిన భూమిరెడ్డి సాయిశ్రీనివాస రెడ్డిని సత్కరించారు.
మరో అతిధి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) మాట్లాడుతూ, భారతదేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడ వనరులకు కొదవ లేదని, చంద్రబాబు నాయుడి నాయకత్వం, పాలన దక్షతతో పలు రంగాలలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాదిస్తుందని, యువనేత లోకేష్ నేటి తరానికి చెందిన నాయకత్వ లక్షణాలతో దూసుకుపోతున్నారన్నారు. సంపద సృష్టించటంతో పాటు..అభివృద్ధి, సంక్షేమాన్ని సైకిల్ కు రెండు చక్రాలుగా మలిచిన ఘనత చంద్రబాబుదన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ, వృత్తి, ఉపాధి రీత్యా ఏ దేశంలోఉన్నా మాతృభూమి, మాతృబాష మనకు రెండు కళ్ళు అని, పుట్టి పెరిగిన గ్రామాల అభివృద్ధికి ఎన్నారైల భాగస్వాములవ్వరన్నారు. జన్మభూమి స్ఫూర్తినందించిన చంద్రబాబు (Nara Chandrababu Naidu) సమర్ధ నాయకత్వాన్ని నిలబెట్టుకోవటం, పౌరులుగా మనవంతు సహకారం అందించటం మన భాద్యత.
అనంతరం గన్ని వీరాంజనేయులు (Ganni Veeranjaneyulu) ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ (Satyanarayana Manne), బొల్లినేని సాయి (Sai Bollineni), పొత్తూరి నాగసత్యనారాయణరాజు, మైనేని రామ్ ప్రసాద్, అవిర్నేని రమేష్, కందుల అభిరామ్, ఎండూరి సీతారామారావు, సామినేని వెంకటేశ్వర్రావు, అరుణ్, అమరలింగం, వెంకట రెడ్డి, గోవర్ధన్, సుబ్బారావు, రమణ, నూరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.