Connect with us

News

వసంత కృష్ణ ప్రసాద్, మన్నవ సుబ్బారావు అతిథులుగా కిషోర్ బాబు చలసానికి సత్కారం @ Guntur, Andhra Pradesh

Published

on

Guntur, Andhra Pradesh: ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా… మన మూలాలు తెలుగునేలలోనే…మన అనుభవం ప్రపంచానికి… మన సేవ మాతృభూమికి. ఒక ప్రవాసాంధ్రుడిగా నేను బలంగా ఇదే నమ్మేది….అని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ (Global NRI TDP) ప్రధాన కార్యదర్శి కిషోర్ బాబు చలసాని అన్నారు. ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనను గుంటూరులో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే (Mylavaram MLA) వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad), గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ నియామకం దోహదపడుతుందన్నారు.

సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu), యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని.. ఏపీ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కిషోర్ బాబును కోరారు.

ఐరోపా దేశాల్లో తెలుగుదేశం మరింత బలోపేతం కావడానికి అవకాశం : మన్నవ సుబ్బారావు

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ బాబు చలసాని ఎంపిక అభినందనీయమన్నారు. ఆయన నియామకంతో ఐరోపాలో (Europe) తెలుగుదేశం బలోపేతానికి మరింత కృషిచేసే అవకాశం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ ఏర్పాటులో ఎన్ఆర్ఐల (NRIs) కృషి మరువలేనిదని కొనియాడారు. అందరం కలిసి తెలుగుజాతి ప్రథమస్థానంలో నిలిపే బాధ్యతను తీసుకుందామని…. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను (NDA) తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చారు.

NRI TDP ఒక సంస్థగా కాకుండా స్వరాష్ట్రానికి, దేశ విదేశాల్లోని తెలుగువారికి వారధిగా నిలవాలి : కిషోర్ బాబు

కిషోర్ బాబు చలసాని (Kishore Babu Chalasani) మాట్లాడుతూ.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ (Global NRI TDP) కమిటీ తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా సేవ చేసే అవకాశం లభించిందన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి చంద్రబాబు, నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా.. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా కృషిచేస్తామని తెలిపారు.

డా. గురురాజా (Dr. Pilli Guru Raja) వంటి గొప్ప నాయకుడు NRI TDP గ్లోబల్ ప్రెసిడెంట్‌గా ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐర్లాండ్ (Ireland) కు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, పారుపల్లి నాగేశ్వరరావు, సామినేని కోటీశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, గంటా పున్నారావు, మైనేని రాంప్రసాద్, వడ్లమూడి నాగేంద్రం, సూర్యదేవర రవీంద్రనాథ్, నెలకుదిటి నరహరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected