Khammam, Telangana: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన నిరుపేద విద్యార్థిని షేక్ తస్లీమా సుల్తానాకు చేతన ఫౌండేషన్ (Chetana Foundation) ఆధ్వర్యంలో కాలేజీ ఫీజు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం ఆమె ఖమ్మంలోని ఎస్ ఆర్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతోంది.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటంతో చదువును కొనసాగించడం కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో, ఈ విషయం ఖమ్మం (Khammam, Telangana) అదనపు కలెక్టర్ పి. శ్రీజ గారి దృష్టికి చేరింది. ఆమె సూచన మేరకు చేతన ఫౌండేషన్ (Chetana Foundation) సభ్యులు స్పందించారు.
కెనడా ప్రతినిధి నెమలపూరి సీతారామారావు గారి స్నేహితులు రాకేష్ మందారపు, ఆదిత్య శెట్టి సహకారంతో విద్యార్థిని విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును చెల్లించారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ (Chetana Foundation) ట్రెజరర్ ముత్తినేని సురేష్, సభ్యులు చంద్రకాని నవీన్, షేక్ రషీద్, చలపతిరావు పాల్గొన్నారు.
చేతన ఫౌండేషన్ (Chetana Foundation) ప్రతినిధులు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు.