Connect with us

Conference

ఆటా కన్వెన్షన్ ఫండ్రైజర్ & కిక్ ఆఫ్ ఈవెంట్ కి విశేష స్పందన @ Frisco, Dallas, Texas

Published

on

Frisco, Dallas, Texas: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 24, 2026 శుక్రవారం ఫ్రిస్కో, డల్లాస్‌ లోని శుభం ఈవెంట్ సెంటర్‌లో కన్వెన్షన్ కిక్ ఆఫ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి, కన్వీనర్ శ్రీధర్ బనాలా (Sridhar Banala), కో-కన్వీనర్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ అరవింద్ రెడ్డి ముప్పిడి, జాయింట్ సెక్రటరీ శారద సింగిరెడ్డి (Sharada Singireddy), బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రఘువీర్ మరిపెద్ది, అనిల్ బొద్దిరెడ్డి (Anil Boddireddy), రీజినల్ కోఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీ అడ్వైజర్స్ మరియు స్టాండింగ్ కమిటీ చైర్స్ పాల్గొన్నారు.

ప్రార్థనా గీతం మరియు జ్యోతి ప్రజ్వలనం‌తో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం డల్లాస్ స్థానిక కళాకారులు సంగీత మరియు నృత్య కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa) గారు ఆటా గురించి మాట్లాడారు.

ఆటా (ATA) 36 ఏళ్ల క్రితం స్థాపించబడిన గొప్ప సంస్థ అని పేర్కొన్నారు. స్థాపన నుండి నేటి వరకు ఆటా అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, కళాకారులకు వేదికను కల్పించి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన విశిష్ట సంస్థగా నిలిచిందని తెలిపారు.

ఆటా కేవలం సాహిత్యం, సంగీతం వంటి కళలకే పరిమితం కాకుండా ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యా–వ్యాపార సెమినార్లు, మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో సేవలు (Service Activities) అందిస్తున్నదని పేర్కొన్నారు.

అలాగే అమెరికా వ్యాప్తంగా ఆటా సేవా కార్యక్రమాలు విస్తరించాయని, రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు వారిని ఒకచోట కలిపి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహాసభలను నిర్వహిస్తున్నదని తెలిపారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌కు (Convention) అందరినీ ఆహ్వానించారు.

ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి (Satish Reddy) గారు మాట్లాడుతూ, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారత్‌లోని రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలు మరియు పాఠశాలల్లో ఆరోగ్య, విద్యా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వివరించారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్‌ (American Red Cross Society) తో కలిసి బాధితులకు ఆర్థిక సహాయం అందించడం, విద్యార్థులు మరియు కుటుంబాలకు అవసరమైనప్పుడు తక్షణ సహాయం అందిస్తూ, ఇండియన్ కాన్సులేట్‌తో సమన్వయం చేసుకుంటూ వేగంగా స్పందిస్తున్న సంస్థగా ఆటా (ATA) నిలిచిందని పేర్కొన్నారు.

ఈ ఈవెంట్‌కు ఆశించినదానికన్నా ఎంతో ఎక్కువగా, విశేష స్పందనతో దాతలు ముందుకు రావడం అత్యంత ఆనందదాయకం మరియు అభినందనీయం. ఈ మహత్తర సహకారం ఈ కార్యక్రమ విజయానికి బలమైన పునాది అయింది. ప్రతి దాతకు పేరుపేరునా ఆటా (ATA) కార్యవర్గ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

జూన్ 21, 2026న స్థానిక కళాకారుల కోసం సంగీతం, నృత్యం, పేజెంట్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి ఈసారి కన్వెన్షన్ (Convention) మెగా స్టేజ్‌పై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించబడుతుంది.

ఆటా (ATA) కార్యవర్గ బృందం స్వప్న తుమ్మపాల, శ్యామ్ మలసాల, సాహితి మూట, రామ్ అన్నాడి, అశోక్ పొద్దుటూరి, రామ్ కాసర్ల, శ్రీనివాస్ రెడ్డి కేలం, సత్య పెర్కారి, వేణు తనికెల్ల, మంజుల ముప్పిడి, హరిత కేలం, హర్షదా ఆర్య మాసెట్టి, సుమా ముప్పాల, మంజులా కునాడి తదితరులు కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘ నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు మరియు సభ్యులు ఈ వేడుకను ప్రశంసించారు. ఈ కార్యక్రమం రాబోయే ATA 19వ కాన్ఫరెన్స్ మరియు యువత సమ్మేళనానికి కిక్-ఆఫ్‌గా (Convention Kickoff) ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

రీజినల్ కోఆర్డినేటర్ శ్యామ్ మలసాల సహాయ సహకారం అందించిన Sound O Rama, Desi Chowrastha మరియు Shubham Event Center యాజమాన్యానికి, అలాగే విచ్చేసిన అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆటా నాయకులు.