Connect with us

Conference

ATA @ Baltimore, Maryland: అతిరథ మహారధులతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఆటా 19వ మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు

Published

on

అతిరథ మహారధులతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఆటా 19 వ కాన్ఫెరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కి బాల్టిమోర్ (Baltimore, Maryland) నగరం ముస్తాబవుతోంది. వేల మంది ఎన్ ఆర్ ఐ ప్రముఖులు, తెలుగు వారు పాలుపంచుకోనున్న ఈ మహా సభలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియచేసింది.

దాదాపు 70 కమిటీలు వందల కొద్దీ వాలంటీర్స్ స్వచ్చందంగా రేయంభవళ్లు కష్టపడి ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్న ఈ మహాసభలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయని, అందరూ సహకరించవల్సిందిగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల (Jayanth Challa) పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద పీఠ వేస్తూ, విద్య వైద్య, అలుమ్ని, బిజినెస్ కాంఫరెన్సెస్ కూడా నిర్వహిస్తున్నారు.

1991 లో స్థాపించబడి 35 వసంతాలు నిండిన ఆటా (ATA) సంస్థ ఎన్ ఆర్ ఐ ల కోసం ఎన్నో సాంస్కృతిక, సామజిక, సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రాచుర్యం పొందిన సంగతి పాఠకులకు విదితమే. అమెరికాలో తెలుగు వారికి తోడ్పాటుగా ఉంటూ విపత్కర పరిస్థితుల కూడా ఎనలేని సేవలందిస్తోంది. యూత్, తెలుగువారిని సంఘటితం చెయ్యటం, వ్యాపార, వైద్య రంగాలలో సేవలు అందించటం ముదావహం. మాతృభూమి లో కూడా ఆటా ఫౌండేషన్ ద్వారా ఎన్నో విద్య, వైద్య, వరదలు, కోవిద్ మరియు ఎన్నో సందర్భాలలో విశేష సేవలు అందిస్తోంది.

బాల్టిమోర్ (Baltimore, Maryland) కన్వెన్షన్లో బిజినెస్ సెమినర్స్ అలరించనున్నాయి. బిజినెస్ దిగ్గజాలు, ఇన్వెస్టర్స్, స్టార్టుప్ ఫౌండర్స్ మరియు ఔత్సాహికుల సమక్షంలో బి 2బి మ్యాచ్ మేకింగ్, ఎగ్జిక్యూటివ్ నెట్వర్కింగ్ సెషన్స్, మెర్జర్స్ & అక్విజిషన్ ఫోరమ్స్ మరియు జీ టీవీ 5 సహకారంతో ఐడియా బాజ్ మొదలగు వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. తమ సృజనాత్మకకు, బిజినెస్ రంగంలో అభివృద్ధి చెందాలనుకొనేవారందరికి వారికి ఇది మహా అవకాశం.

మెడికల్ రంగంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రభావం, హృద్రోగ, డయాబెటిస్, కాన్సర్ రీసెర్చ్ రంగాలలో ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది తదితర విషయాలు సి ఎం ఈ కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు. శ్రీ శివ పార్వతుల కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫాషన్ షో, నిరావాల్ బ్యాండ్ లైవ్ కన్సర్ట్, ఆటా బ్యూటీ పాజంట్, యూత్ ఫాషన్ షో, అష్టావధానం, లిటరరీ కాంఫరెన్సెస్, యూత్ క్రూజ, ఆటా మాట్రిమోనీ తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.

అమెరికాలో పుట్టి పెరుగుతున్న యువతీ, యువకులు మరియు అమెరికాకు ఉన్నత చదువులు పొందడానికి, అలాగే ఉద్యోగాల కోసం వచ్చిన వారికి ఆటా వివాహ పరిచయ వేదిక సహాయం చేస్తుంది. ఒక మినీ మాల్ ని తలపించనున్న విధంగా వివిధ వేండొర్ బూత్స్ ఏర్పాటు చేసారు. జ్యువలరీ మొదలుకొని రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్, అవగాహన సదస్సు లని ఏర్పాటు చేసారు. కుటుంబ సమేతంగా అందరికి ఒక మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా డిజైన్ చేసారు.

ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల (Jayanth Challa) గారు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారి ప్రతిభ పాటవాలని ప్రపంచానికి పరిచయం చెయ్యటంలో ఆటా ప్రధాన భూమిక పోషిస్తుందని ఉద్గాటించారు. నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు వారు అందరూ విచ్చేసి ఆటా సభలను విజయవంతం చెయ్యవలిసిందిగా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.

ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల (Sridhar Banala) మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్వహిస్తున్న ఈ సభలలో ప్రతి ఒక్కరు ఎన్నో వివిధ భరితమైన కార్యక్రమాలతో అందరిని అలరించబోతున్నామని, అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేసారు. July 31 – ఆగష్టు 2 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

error: NRI2NRI.COM copyright content is protected