అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, చార్లెట్ (Charlotte Convention Center) మహానగరంలో మొట్టమొదటిసారి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహణకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారధులు అంతా తరలివచ్చేశారు.
జులై 17 శుక్రవారం నుంచి జులై 19 ఆదివారం వరకు మూడు రోజులపాటు ఒక పండుగలా నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. పలు కమిటీల శ్రమ ఒక ఎత్తైతే, గత 10 రోజుల నుంచి TTA పెద్దలందరూ చార్లెట్ (Charlotte, North Carolina) లో మకాం వేసి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వీరి కస్టే ఫలి మూడు రోజుల తెలంగాణ తెలుగు పండుగ రూపంలో అలరించడానికి ఆల్ సెట్ అంటున్నారు నిర్వాహకులు. హాస్పిటాలిటీకి (Hospitality) ఎక్కడా లోటు లేకుండా అతిథులను ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకునేలా, హోటెల్ రిజర్వేషన్స్ స్మూత్ గా సాగేలా, అందరికీ ఫోన్లు చేసి మరి వివరాలు కనుక్కొని పక్కాగా చేస్తున్నారు.
కన్వెన్షన్ మూడు రోజులపాటు తెలంగాణ ఆతిథ్యం అందేలా ప్రణాళికలు రచించారు. శుక్రవారం బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) తో ప్రారంభమై శనివారం, ఆదివారం మూడు రోజులపాటు విభిన్న కార్యక్రమాలతో చార్లెట్ (Charlotte, North Carolina)నగరం కళకళలాడనున్నది.
మాట్రిమోనియాల్, విమెన్స్ ఫోరమ్, CME, బిజినెస్, పొలిటికల్, నెట్వర్కింగ్ సెమినార్స్, ఇండియా పెరేడ్, యువత ప్రోగ్రామ్స్, సాహిత్య, ఆధ్యాత్మిక, షాపింగ్ బూత్స్, సెలెబ్రిటీ మీట్ అండ్ గ్రీట్, ఫోటో బూత్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, TTA స్టార్ ఫైనల్స్ వంటి కార్యక్రమాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
ఇప్పటి వరకు ఏ తెలుగు సంఘం కూడా కన్వెన్షన్ నిర్వహించని చార్లెట్ నగరంలో మొట్టమొదటిసారి TTA (Telangana American Telugu Association) నిర్వహించడం విశేషం. శ్రీ శ్రీనివాస కల్యాణం, అవార్డ్స్ ప్రజంటేషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్, యూత్ బాంక్వెట్, లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ (Concert) తో జస్ట్ ఎంబ్రేస్ ఇట్ ఇన్ చార్లెట్ అనేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయం.
రెండు తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా సెలెబ్రిటీలు, సినీ నటీనటులు, రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు తరలివచ్చారు. TTA అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi), కన్వీనర్ ప్రవీణ్ చింతా (Praveen Chintha), కోఆర్డినేటర్ నరేన్ దేవరపల్లి (Naren Devarapalli), కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి (Shekar Reddy) ఆధ్వరంలో చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబైంది.
TTA (Telangana American Telugu Association) లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, వంశీ రెడ్డి కంచరకుంట్ల, శ్రీని అనుగు లాజిస్టిక్స్ తదితర విషయాలలో దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రతి రోజూ ఒక లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Show) ఉండేలా ప్లాన్ చేశారు. దీంతో సంగీతప్రియుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. శుక్రవారం ఆరంజ్ స్ట్రీట్ బ్యాండ్ (Orange Street Band), శనివారం త్రీయరీ బ్యాండ్ (Threeory Band), ఇక ఆదివారం అయితే తన సంగీతంతో ఆస్కార్ వేదికను పంచుకున్న ఎం ఎం కీరవాణి (MM Keeravani) అలరించనున్నారు.