తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) మొన్న శుక్రవారం, జులై 17న చార్లెట్ (Charlotte, North Carolina) లోఅంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. కన్వెన్షన్ మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ విజయవంతం కాగా, నిన్న కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి.
ఉదయాన్నే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిర్వహించిన ఇండియా డే పరేడ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని (Unity in Diversity) మరోసారి తెలియపరిచింది. బోనాలు, బతుకమ్మ, పోతురాజు తో TTA మహిళలు, నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్ (Inaugural) కి విచ్చేశారు.
అందరికీ స్వాగతం పలికి గణపతి స్తోత్రంతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలను ప్రారంభించారు. గౌరవంగా నుంచొని అమెరికా, భారతదేశం (US & India National Anthems) జాతీయ గీతాలతోపాటు, తెలంగాణ (Telangana) రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.
TTA కార్యవర్గాన్ని వ్యాఖ్యాతలు వేదిక పైకి ఆహ్వానించి TTA ప్రస్థానంపై వీడియో ప్రదర్శించారు. తర్వాత తెలంగాణ అతిరథ మహారధుల సమక్షంలో శుభసూచికంగా జ్యోతి ప్రజ్వలన గావించారు. తదనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
TTA అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi), వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, వంశీ రెడ్డి కంచరకుంట్ల ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు.
సమాంతరంగా వివిధ బ్రేకౌట్ రూమ్స్ లో TTA Startup Cube, మాట్రిమోనీ, CME, అష్టావధానం, TTA స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజెంట్ (Beauty Pageant), యూత్ సెషన్స్ (Youth Programs), పొలిటికల్ మీట్ & గ్రీట్స్, సాహితీవేత్తలతో ముఖాముఖీ నిర్వహించారు.
ఇక సాయంత్రం మెయిన్ స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాల (Cultural Performances) పరంపర మొదలైంది. ప్రముఖ వైద్యులు డా. గురువారెడ్డి (Dr. AV Gurava Reddy) కి మెడికల్ సర్వీస్ విభాగంలో అవార్డు ప్రదానం చేశారు. అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క (Seethakka – Dansari Anasuya) ఇన్స్పైరింగ్ గా చేసిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మరియు హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) కలిసి ఎల్లమ్మ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు.
తెలుగు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరియు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వేదికపై డాన్స్ చేయడంతో అందరూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. హీరోయిన్ దివి నటించిన సినిమా పాటను ప్లే చేశారు.
ప్రస్తుత టాక్ ఆఫ్ ది టౌన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) వేదికపై లక్కీ భాస్కర్ సినిమాలోని డైలాగ్ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం వీరందరినీ TTA నాయకులు ఘనంగా మెమెంటో మరియు శాలువాతో సన్మానించారు.
TTA (Telangana American Telugu Association) కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింతా ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. గతకొన్ని కొన్ని నెలలగా పడిన కష్టాన్ని, అందరూ అందించిన సహకారాన్ని కళ్ళకు కట్టినట్టుగుర్తుచేసుకున్నారు.
స్టేట్ సెనేటర్ మరియు లేబర్ కమీషనర్ ఇండియన్ కమ్యూనిటీ, జాబ్స్ క్రియేషన్, TTA గురించి ప్రసంగించడం విశేషం. బ్యూటీ పాజెంట్ (Beauty Pageant) విజేతలను ప్రకటించి క్రౌన్ సెరిమోనీ నిర్వహించారు. లంచ్ మరియు డిన్నర్ మెన్యూ బాగుంది.
యాంకర్స్ సుమ, రవి ఫన్నీ యాంకరింగ్ తో ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. TTA (Telangana American Telugu Association) కన్వెన్షన్ కోసం ప్రత్యేకంగా రచించి, పాడి నృత్యరూపకంలో ప్రదర్శించిన తీరుకి అందరూ స్టాండింగ్ ఒవేషన్ (Standing Ovation) ఇచ్చారు.
చివరిగా హైదరాబాద్ నుండి వచ్చిన త్రీయరీ బ్యాండ్ (Threeory Band) వారు లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో TTA (Telangana American Telugu Association) కన్వెన్షన్ రెండో రోజుకి ఘనమైన ముగింపు పలికారు.