Connect with us

Conference

అతిరథ మహారధుల నడుమ బాంక్వెట్ డిన్నర్ తో TTA Mega Convention కి ఘనమైన ఆరంభం @ Charlotte Convention Center

Published

on

ఇప్పటి వరకు ఏ తెలుగు సంఘం కూడా కన్వెన్షన్ నిర్వహించని చార్లెట్ (Charlotte, North Carolina) నగరంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మొట్టమొదటిసారి మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

నిన్నటి నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్ లో మొదటిరోజైన బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) కార్యక్రమం అతిరథ మహారధుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికా నలుమూలల నుండి TTA నాయకులు, సభ్యులు, చార్లెట్ ప్రవాస తెలుగువారు హాజరయ్యారు.

మొట్టమొదటిసారి చార్లెట్ (Charlotte, North Carolina) లో నిర్వహిస్తున్న తెలుగు కన్వెన్షన్ అవ్వడంతో అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అందరి అంచనాలను దాటి ఎయిర్పోర్ట్ పికప్స్ దగ్గిర నుండి, హోటల్ అకామడేషన్, రెజిస్ట్రేషన్, టికెట్స్ వరకు ఒక పద్దతి ప్రకారం నీటుగా చేశారు.

కాక్టైల్ అవర్ అనంతరం ముందుగా ప్రముఖ యాంకర్ సుమ అందరికీ స్వాగతం పలికారు. అనంతరం, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA) నాయకత్వం అంతా కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

తర్వాత కన్వెన్షన్ సావనీర్ (Souvenir) ఆవిష్కరించారు. ఏవీలు ప్రదర్శించి వివిధ రంగాలలో అవార్డులు (TTA Awards) అందజేశారు. మధ్యమధ్యలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), మెడ్లి డాన్సులు బహు చక్కగా ఉన్నాయి.

వందేమాతరం శ్రీనివాస్ (Kanneboina Srinivasa Rao Yadav) కి అవార్డు అందించిన తర్వాత తన సారధ్యంలో గాయనీగాయకులు జానపదాలు పాడి అందరినీ అలరించారు. ముఖ్యంగా తెలంగాణ యాసతో పాడిన పాటలు అందరినీ అలరించాయి.

తానా, ఆటా, నాట్స్, జిటిఎ, టిడిఎఫ్, మాటా వంటి ఇతర జాతీయ తెలుగు సంఘాల నాయకులు ఎక్కువమంది ఈ కన్వెన్షన్ కి హాజరయ్యారు, వీరందరినీ వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. ఫోటో బూత్స్, అలంకరణలు, డిస్ప్లేలు చక్కగా ఏర్పాటు చేశారు.

TTA వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి మరియు వంశీ రెడ్డి కంచరకుంట్ల పర్యవేక్షణలో కన్వెన్షన్ (TTA Mega Convention) మొదటిరోజు విజయవంతంగా సాగింది.

ఇండియా నుంచి వచ్చిన వారిలో తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు (Madhavaneni Raghunandan Rao), మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), మాజీ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి (Dr. AV Gurava Reddy) తదితరులు ఉన్నారు.

అలాగే టాలీవుడ్ నుంచి దర్శకులు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), యాంకర్ సుమ, నిర్మాత దిల్ రాజు (Dil Raju), నటీమణులు దివి, అన్షు రెడ్డి, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, మిమిక్రీ ఆర్టిస్ట్ & నటులు శివారెడ్డి, పాటల రచయిత శ్యామ్ కాసర్ల అందరూ అడిగినవారితో కాదనకుండా ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.

TTA (Telangana American Telugu Association) మాజీ అధ్యక్షులు అందరినీ వేదికపై ఘనంగా సత్కరించారు. సమాంతరంగా పలు స్టేషన్స్ పెట్టి లేట్ అవకుండా డిన్నర్ ఏర్పాట్లు చేయడంతో అందరూ భోజనాలు గావించారు. ప్రత్యేకంగా బాల్ రోమ్ లో ఏర్పాటు చేసిన యూత్ బాంక్వెట్ కు మంచి స్పందన వచ్చింది.

బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం క్లైమాక్స్ లో ఆరంజ్ స్ట్రీట్ బ్యాండ్ (Orange Street Band) వారి లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Show) దుమ్ము లేపింది. యూత్, మహిళలు ఎనర్జిటిక్ పాటలకు వేదిక ముందుకు వచ్చేసి పోటాపోటీగా డాన్స్ చేశారు.

బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఆసాంతం యాంకర్ సుమ కనకాల తనదైన శైలి వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. TTA మెగా కన్వెన్షన్ మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/TTA Mega Convention in Charlotte Banquet Dinner ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected