Connect with us

News

Germany, Homburg: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా నారా చంద్రబాబు నాయుడు

Published

on

Homburg, Germany: ది. 20.04.2026 న జర్మనీ లో హాంబర్గ్ నగరం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76 వ జన్మ దిన వేడుకలు ఎన్ ఆర్ ఐ టీ డీ పీ, హాంబర్గ్, జర్మనీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో ఈ కార్యక్రమం ప్రారంభమైనది.

అనంతరం చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. నాలుగు దశాబ్దాల పైబడిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం, ముఖ్య ఘట్టాలు, ఆయన అమలు చేసిన అభివృధి మరియు సంక్షేమ కార్యక్రమాలు తో చేసిన వీడియో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా అమరావతి (Amaravathi) ని ఆంధ్రుల రాజధానిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే విధంగా చంద్ర బాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన అవిరళ కృషిని కొనియాడారు. భారత పార్లమెంటు ఉభయసభల్లో చర్చలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు (వైకాపా తప్ప) ఏకగ్రీవంగా ముక్త కంఠంతో బిల్లుకు మద్దతు లభించింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు కి జాతీయ స్థాయిలో ఉన్న విశ్వసనీయత వల్లే సాధ్యం అయింది అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ (Narendra Modi) మరియు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) కు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు భిన్నమైన పాలనను అందిస్తూ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు అని అన్నారు.

ఈ సందర్భంగా వక్తలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు పాత్రని కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ ని ఎక్కువ పరిపాలించిన ముఖ్య మంత్రిగా, ప్రతిపక్ష నేత గా చరిత్ర లో నిలచి పోయారు అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను శిథిలం నుంచి శిఖరం వైపున నడిపిస్తున్నారు. సంక్షోభం నుంచి అవకాశాల ను వెదకటం చంద్ర బాబు నైజం అని అన్నారు.

చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి విజనరీ ఆలోచనల మీద ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు రచించిన “చంద్రబాబు నాయుడు X.0” పుస్తకం జర్మన్ మరియు ఫ్రెంచ్ భాషల అనువాద ప్రతులను పంపిణీ చేశారు. జర్మన్ అనువాద ప్రతులను జర్మనీ లో ప్రముఖ నగరాల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నాం అని టిట్టు మద్దిపట్ల మరియు శివ శంకర్ లింగం కృషి చేస్తున్నారు అని అన్నారు.

చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతం లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా బెలూన్లు ఎగుర వేస్తూ పండుగ వాతావరణాన్ని తలపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హాంబర్గ్ టీడీపీ (TDP) టీం నుండి డాక్టర్ శివ శంకర్ లింగం, శశిధర్ ఏమిరెడ్డి, విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, శ్రీకాంత్ గోళ్ళ, రాజా పులిచర్ల, శివ కోలా, చైతన్య యలమంచి, యాగేష్, నాగేంద్ర కూతురు, వఝల చాణక్య, భరత్ శీలంనేని, లక్ష్మీ పెర్నీడు బొల్లెంపల్లి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బ్రౌన్చ్ వైగ్ నగరం నుండి టిట్టు మద్దిపట్ల, హిల్దిస్ హైం నగరం నుండి రామ రాయలు వట్టికూటి, బ్రిమెన్ నగరం నుండి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ ఆర్ ఐ టీడీపీ ప్రతినిధుల తో పాటు పలువురు తెలుగు సంఘం (Telugu Association) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలు చివరగా రుచి కరమైన తెలుగు విందు భోజనం తో ముగిశాయి.

error: NRI2NRI.COM copyright content is protected