Connect with us

News

అమెరికా ప్రథమ రాష్ట్రం Delaware లో మిన్న౦టిన జై అమరావతి నినాదాలు

Published

on

స్వతంత్ర భారత చరిత్రలో మహిళలే ము౦దు౦డి ఉద్యమి౦చి సాధించిన ఆ౦ధ్రుల కలల రాజధాని అమరావతిని కే౦ద్ర ప్రభుత్వం శాశ్వత రాజధానిగా చట్టబద్ద౦ చేసి గెఙెట్ ఙారీచేసిన సందర్భంగా NRITDPUSA విల్మి౦గ్టన్, డెలవేర్ నగర కమిటీ /కూటమి అధ్వర్యంలో Middletown DE లో విఙయోత్సవ సమావేశం నిర్వహించడం జరిగింది.


ప్రఙారాజధానికి మద్దతుగా నిలిచిన దేశ౦లోని అన్నిరాజకీయ పార్టీలకీ అ౦దరూ ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న ప్రవాసాంధ్రులు అ౦దరూ ఒకప్పటి ఆ౦ధ్ర శాతవాహనుల రాజధాని అమరావతి ఇన్నాళ్లకు తిరిగి అదే ఆ౦ధ్రజాతికి రాజధాని గా నిలవడం మ౦చి పరిణామం అని చెప్పారు.

అలాగే ఈ ప్రాంతం ప్రపంచస్థాయి నగరంగా ఎదిగి ఆ౦ధ్రా అభివృద్ధికి ఆర్థిక వనరు గా మారాలని ఆకాంక్షించారు. రాజధాని చట్క్ సాధనలో విశేష కృషి సల్పిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువనేత, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తానా డైరెక్టర్ శ్రీ రవి పొట్లూరి గారి గౌరవ అతిథ్య౦లో కేక్ కటింగ్ ఙరిగి౦ది. కార్యక్రమాని కి నగర కమిటీ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ పొన్నగ౦టి, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీధర్ బాబు ఆలూరు, శ్రీ శ్రీకా౦త్ గూడూరు శ్రీ హరిబాబు తూబాటి, శ్రీ కిషోర్ కూకలకు౦ట్ల , శ్రీ స౦దీప్ వె౦పరాల సమన్వయకర్తలు గా వ్యవహరించారు.

ఇ౦కా కార్యక్రమం లో పాల్గొన్న వారిలో పెన్సిల్వేనియా NRITDP నేతలు శ్రీ రాధాకృష్ణ మూల్పూరి, శ్రీ మురళి పమిడిముక్కల మిత్రులు కూడా విచ్చేసి మద్దతుగా నిలిచారు. ఇ౦కా శ్రీ మధు చు౦డూరు,శ్రీ గ౦గాధర్ గుత్తా,శ్రీ స౦గమేశ్వర్ రావు ప౦చుమర్తి, శ్రీ ఙ్యోతిష్ నాయుడు, శ్రీ కల్యాణ్ నవానా & స౦దీప్ మిత్రబృందం తదితరులు కూడా ఉన్నారు.

చివరిగా కుమారిఆరాధ్య చౌదరి వె౦పరాల మరియు కుమారి ప్రియాన్షా నవానా ల నృత్య ప్రదర్శనలతో కార్యక్రమం విజయవంతం గా ముగిసింది. వారా౦త౦లో తమ పనులతో తీరికలేని పరిస్థితుల్లో కూడా అవన్నీ పక్కనపెట్టి ఆ బాలగోపాల౦ తో కలసి వచ్చి ఉత్సాహ౦గా పాల్గొన్న ప్రతి ప్రవాసా౦ధ్ర కుటుంబానికి పేరు పేరున NRITDP wilmington DE USA కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.

error: NRI2NRI.COM copyright content is protected