Connect with us

News

Kannapolis Carolina Pickleball Club వేదికగా నిర్వహించిన తానా టోర్నమెంట్ కు మంచి స్పందన

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఆటల పోటీలను తానా ప్రారంభించింది. అందులో బాగంగా శనివారం (జూన్ 6) కన్నపోలిస్‌లోని ‘కరోలినా పికిల్‌బాల్ క్లబ్’ (Carolina Pickleball Club) వేదికగా నిర్వహించిన ‘తానా పికిల్‌బాల్ టోర్నమెంట్’ అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది.

చార్లెట్ (Charlotte, North Carolina) ప్రాంతంతో పాటు జాతీయ స్థాయిలో పికిల్‌బాల్ (Pickleball) క్రీడను ప్రోత్సహించడంలో తానా ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే తెలుగు కమ్యూనిటీలో పికిల్‌బాల్ టోర్నమెంట్‌ను పరిచయం చేసిన ఘనత తానాదే. నాటి నుండి నేటి వరకు ఈ క్రీడ పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది. మహిళలు, పురుషులు, పిల్లలు ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

బిగినర్, ఇంటర్మీడియెడ్, అడ్వాన్స్‌డ్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పోటీలు జరిగాయి. ఎక్కువమంది పాల్గొనడంతో పోటీలు ఆసక్తిగా సాగాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో 65కు పైగా టీములు ఉత్సాహంగా పాల్గొని తలపడ్డాయి. టోర్నమెంట్‌ను ఇంతటి భారీ స్థాయిలో విజయవంతం చేసిన ఆటగాళ్లను, నిర్వాహక బృందాన్ని తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు (Srinivas Lavu) ప్రత్యేకంగా అభినందించారు.

తానా అప్పలాచియన్ (Appalachian) రీజినల్ రిప్రజెంటేటివ్ రవి (నాని) వడ్లమూడి నేతృత్వంలో ఈ ఈవెంట్ విజయవంతంగా సాగింది. చార్లెట్ (Charlotte, North Carolina) పికిల్‌బాల్ టీమ్ సభ్యులు తారక్ పూడి, కార్తీక్ పాండ్రా, పవన్ పెట్టంబరం వెంకట, స్పోర్ట్స్ చైర్ దినేష్ దొంగ తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

వీరితోపాటు స్థానిక తానా నాయకులు రవి (నాని) వడ్లమూడి, నాగ పంచుమర్తి (Naga Panchumarthi), ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, అన్నే రమణ కూడా ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి విశేష కృషి చేశారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడంలో తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి (Raja Kasukurthi) కీలక పాత్ర పోషించారు.

ఈవెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏర్పాటు చేయడం, పేమెంట్ల ట్రాకింగ్, మరియు టోర్నమెంట్ (Pickleball Tournament) అంతటా ఆర్థిక సమన్వయాన్ని అద్భుతంగా పర్యవేక్షించి ఈవెంట్ ఎంతో క్రమశిక్షణతో, సమర్థవంతంగా విజయవంతం కావడానికి ఆయన ఎంతో మద్దతును అందించారు. వారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా, రన్నరప్‌లుగా నిలిచిన టీములకు ముగింపు వేడుకలో ఘనంగా ట్రోఫీలను అందజేశారు. ఈ ఈవెంట్‌కు స్పాన్సర్లుగా వ్యవహరించిన నవాబీ హైదరాబాద్ హౌస్ (Nawabi Hyderabad House), కోల్డ్‌వెల్ బ్యాంకర్ రియల్టీ రఘు వేమూరి, మరియు ట్యుటెలరీ ఇంక్ సంస్థలకు తానా నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ వేసవి కాలంలో తానా (Telugu Association of North America – TANA) ఆధ్వర్యంలో మరిన్ని ఆటల పోటీలు జరగనున్నాయి. రాబోయే రోజుల్లో బ్యాడ్మింటన్, క్రికెట్, పురుషుల, మహిళల వాలీబాల్, కిడ్స్ స్పోర్ట్స్, ఐపీఎల్ స్టైల్ వాలీబాల్, మరియు త్రోబాల్ వంటి క్రీడా పోటీలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు తానా సిద్ధమవుతోంది.

error: NRI2NRI.COM copyright content is protected