Connect with us

Politics

విజయవంతంగా 44 ఏళ్ళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు @ Washington D.C.

Published

on

Washington D.C., మార్చి 29, 2026, ఆదివారం: అమెరికా రాజధాని ప్రాంత వేదికగా:
తెలుగుజాతి ఆత్మగౌవర నినాదం పునాదిగా మొదలై, ఒక అసమాన కళాకారుడు నందమూరి తారకరామారావు (NTR) దృఢ చిత్తంతో, ఆపై దార్శనికుడు చంద్రబాబు నాయుడు అవిరళ కృషి, అంకితభావంతో తెలుగు రాష్ట్రాల ప్రగతికి చిహ్నంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ (TDP) 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ అభిమానులు, ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఆ సందర్భంగా ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) కు ఘన నివాళి అర్పించి ఆయన ఆశయమైన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదానికి కట్టుబడి అహర్నిశలూ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), పేద, బలహీన వర్గాల సంక్షేమానికి, యువత భవితకు, మహిళా సాధికారతకూ వేదికగా, కోట్లాది మంది తెలుగువారి ఆస్తిగా, ప్రపంచ దేశాలలో లక్షలాది మంది యువతకు సాంకేతిక రంగ భవితకు స్ఫూర్తినందించిన వేదికగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇటీవల రాష్ట్ర శాసన సభలో అమరావతి (Amaravathi) కి చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తీర్మానం చరిత్రలో మైలురాయిగా, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటగా మిగిలిపోతుందని కార్యక్రమ సమన్వయ కర్త భానుప్రకాష్ మాగులూరి (Bhanu Prakash Maguluri) అన్నారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదని, భూములిచ్చిన రైతుల త్యాగం, కోట్లాది మంది యువతభవితకు, సామాన్యునికి పారిశ్రామిక ఉపాధి కల్పించటంతో పాటు తెలుగు వారి చరిత్ర, సంస్కృతి ఇనుమడించేవిధంగా సమున్నత వేదికగా మిగిలిపోవాలని అందరూ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యశస్వి బొద్దులూరి, సుధీర్ కొమ్మి, సాయి బొల్లినేని (Sai Bollineni), రవి అడుసుమిల్లి (Ravi Adusumilli), సాయిశ్రీనివాస రెడ్డి భూమిరెడ్డి, ఠాగూర్, వెంకటేశ్వర్రావు సామినేని, కిషోర్ కొడాలి, రామకృష్ణ ఇంటూరి, కృష్ణమోహన్ జంపాల, వినీల్ శ్రీరామినేని, మురళికృష్ణ కట్ల, హనుమంతరావు కూచి, రమేష్ రావిపూడి, సీతారామారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.