Connect with us

Convention

మంత్రులకు, మాజీ గవర్నర్ & IAS లకు TTA Convention ఆహ్వానం పలికిన TTA నాయకులు

Published

on

మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ (Seattle) మహానగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహణకు ఒక పక్క పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తుండగా మరో పక్క TTA నాయకులు ఇండియాలో సెలబ్రిటీస్ ని ఆహ్వానించే పనిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మేధావులకు, రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీస్ కి అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi) సారధ్యంలో TTA Convention ఆహ్వానాలు అందించారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ (Telangana) రాష్ట్ర మాజీ గవర్నర్, భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ని హైదరాబాద్ (Hyderabad) లో మర్యాదపూర్వకంగా కలిసి Telangana American Telugu Association (TTA) మెగా కన్వెన్షన్ కి ఆహ్వానించారు.

ఇంకా తెలంగాణ గృహ నిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Nalamada Uttam Kumar Reddy), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy) మరియు పలువురు IAS అధికారులను TTA Mega Convention కి సాదరంగా ఆహ్వానించారు.

ఈ TTA మెగా కన్వెన్షన్ ఆహ్వాన ప్రతులను అందించే కార్యక్రమాలలో టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, రీజినల్ అడ్వైజర్ డా. ద్వారకానాధ్ రెడ్డి, సీఈసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ LN రెడ్డి దొంతిరెడ్డి, నవీన్‌ గోలి తదితర TTA నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆహ్వానితులందరినీ TTA Leaders పుష్పగుచ్చం మరియు శాలువాతో సత్కరించారు. అనంతరం TTA Convention ఆహ్వాన పత్రాలను అందజేశారు. TTA Mega Convention కి సంబంధించిన రిజిస్ట్రేషన్, ప్రోగ్రాం షెడ్యూల్ వంటి మరిన్ని వివరాలకు www.TTAConvention.org ని సందర్శించండి.

కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ
డా. పైళ్ల మల్లారెడ్డి
డా. విజయపాల్ రెడ్డి
డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ
భరత్ రెడ్డి మాదాడి
వంశీ రెడ్డి కంచరకుంట్ల

కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
వంశీ రెడ్డి కంచరకుంట్ల
చంద్రసేన శ్రీరామోజు
నవీన్ రెడ్డి మల్లిపెద్ది
గణేష్ మాధవ్ వీరమనేని
మాణిక్యం తుక్కాపురం
మనోహర్ బాదుకే
డా. నరసింహా రెడ్డి దొంతిరెడ్డి
కవితా రెడ్డి
సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి
డా. దివాకర్ జంధ్యం
శివా రెడ్డి కొల్ల
ప్రదీప్ మెట్టు
ప్రసాద్ కునారపు
సురేష్ రెడ్డి వెంకన్నగారి
ఉషా రెడ్డి మన్నెం

కన్వెన్షన్ రీజినల్ అడ్వైజర్స్
నవీన్ గోలి
మనోజ్ చింతిరెడ్డి
అనీల్ ఎర్రబెల్లి
డా. ద్వారకానాథ్ రెడ్డి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected