Connect with us

Beauty Contest

సౌందర్యంతోపాటు ప్రతిభను ప్రదర్శించే మగువులకు వేదికే TTA Beauty Pageant

Published

on

వచ్చే నెల మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ (Seattle) మహానగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ మెగా కన్వెన్షన్ ని పురస్కరించుకొని బ్యూటీ పాజంట్ TTA 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. సౌందర్యంతోపాటు ప్రతిభను ప్రదరించే మగువులకు తోడ్పాటు అందించే వేదికలా ఈ బ్యూటీ పాజంట్ పోటీలను Telangana American Telugu Association చరిత్రలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నారు.

స్వాతి చెన్నూరి అడ్వైజర్ గా, అనీల కామసాని ఛైర్ గా, భాను రేఖ దట్ల కోఛైర్ గా రోపొందుతున్న బ్యూటీ పాజంట్ TTA 2024 పోటీలు అమెరికాలోని 7 నగరాలలో మిస్ టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ టీన్, మిస్టర్ TTA విభాగాలలో నిర్వహిస్తారు. వీరిలో గెలిచిన వారు TTA కన్వెన్షన్ లో ఫైనల్స్ లో పోటీపడతారు.

సియాటిల్ లో ఫైనల్స్ లో గెలుపొందినవారికి సెలెబ్రెటీస్ చేతుల మీదుగా TTA టైటిల్ మరియు క్రౌన్ ప్రజంట్ చేస్తారు. ఈ బ్యూటీ పాజంట్ పోటీలు (TTA Beauty Pageant) అమెరికాలోని అట్లాంటా, సియాటిల్, పోర్ట్లాండ్, షార్లెట్, వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా నగరాల్లో నిర్వహిస్తారు.

ఈ పోటీలలో పాల్గొనేవారికి బిగ్ బాస్ విన్నర్ & మోడల్ కౌశల్ ఆన్లైన్లో ప్రిపరేషన్ సెషన్స్ ద్వారా టిప్స్ ఇవ్వనుండడం విశేషం. రెజిస్ట్రేషన్, ఫీజు, నిబంధనలు తదితర వివరాలకు www.NRI2NRI.com/Beauty Pageant TTA 2024 ని సందర్శించండి. అలాగే beauty_pageant.inbox@ttaconvention.org కి ఈమెయిల్ చెయ్యండి లేదా ఫ్లయర్ లో ఉన్న కాంటాక్ట్స్ ని సంప్రదించండి.

TTA లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి మార్గదర్శకత్వంలో అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla), కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది సారధ్యంలో కన్వెన్షన్ ఏర్పాట్లు సాగుతున్నాయి. మరిన్ని వివరాలకు www.ttaconvention.org ని సందర్శించండి.

కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ
డా. పైళ్ల మల్లారెడ్డి
డా. విజయపాల్ రెడ్డి
డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ
భరత్ రెడ్డి మాదాడి
వంశీ రెడ్డి కంచరకుంట్ల

కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
వంశీ రెడ్డి కంచరకుంట్ల
చంద్రసేన శ్రీరామోజు
నవీన్ రెడ్డి మల్లిపెద్ది
గణేష్ మాధవ్ వీరమనేని
మాణిక్యం తుక్కాపురం
మనోహర్ బాదుకే
డా. నరసింహా రెడ్డి దొంతిరెడ్డి
కవితా రెడ్డి
సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి
డా. దివాకర్ జంధ్యం
శివా రెడ్డి కొల్ల
ప్రదీప్ మెట్టు
ప్రసాద్ కునారపు
సురేష్ రెడ్డి వెంకన్నగారి
ఉషా రెడ్డి మన్నెం

కన్వెన్షన్ రీజినల్ అడ్వైజర్స్
నవీన్ గోలి
మనోజ్ చింతిరెడ్డి
అనీల్ ఎర్రబెల్లి
డా. ద్వారకానాథ్ రెడ్డి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected