Connect with us

Health

Alpharetta, Georgia: తానా, తామా ఆధ్వర్యంలో ఉపస్తంభ యోగా కార్యక్రమం విజయవంతం

Published

on

కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) సంయుక్తంగా ఆగస్టు 9, 2026న జార్జియాలోని ఆల్ఫారెట్టాలో (Alpharetta, Atlanta, Georgia) ఉన్న కెటి బాంక్వెట్స్‌లో ‘ఉపస్తంభ’ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా శిక్షకులు, సామాజిక కార్యకర్త శ్రీ కిరణ్ చుక్కపల్లి నేతృత్వం వహించారు.

రెండు గంటలపాటు జరిగిన ఈ Yoga కార్యక్రమంలో దాదాపు 50 మందికిపైగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో శ్రీ కిరణ్ (Kiran Chukkapalli) గారు పాల్గొన్న వారికి సూర్య నమస్కారాలు, ఇతర సాంప్రదాయ నమస్కారాలు, అలాగే అన్ని వర్గాల వారికి ఉపయోగపడే వివిధ యోగాసనాలను నేర్పించారు.

ప్రత్యేకంగా ప్రాణాయామం, శ్వాసక్రియ పద్ధతులపై దృష్టి సారిస్తూ, వివిధ యోగా భంగిమలతో శ్వాసను ఎలా సమన్వయం చేసుకోవాలో సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి తానా (TANA) మరియు తామా (TAMA) నాయకులు సహకరించారు.

తానా (TANA) నాయకులు శ్రీనివాస్ లావు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), అంజయ్య చౌదరి లావు (పాస్ట్ ప్రెసిడెంట్), శేఖర్ కొల్లు (RR), భరత్ మద్దినేని (బోర్డు డైరెక్టర్), మధుకర్ యార్లగడ్డ (ఫౌండేషన్ ట్రస్టీ, తామా చైర్మన్), సునీల్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్), సోహిణి అయినాల (వుమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సెక్రటరీ) తోపాటు తామా (TAMA) ప్రెసిడెంట్ సునీత పొట్నూరి (Suneetha Potnuru) సహకారాన్ని, మార్గదరకత్వాన్ని అందించారు.

మాలతి నాగభైరవ (Malathi Nagabhirava), ఆర్తిక అన్నే, పూలని జస్తి, శ్రీనివాస్ ఉప్పు (Srinivas Uppu), చైతన్య కొర్రపాటి, రాజేష్ జంపాల, తిరు చిల్లపల్లి (తామా ప్రెసిడెంట్ ఎలక్ట్), పార్వతి కొంపెల్ల, రాఘవ తాడవర్తి, యశ్వంత్ జొన్నలగడ్డ, హరికృష్ణ అద్దంకి, శ్రీనివాస్ రామనాధం, మరియు సురేష్ ధూళిపూడి (Suresh Dhulipudi) తదితరులుఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.

ఈ Yoga కార్యక్రమం కోసం కెటి బాంక్వెట్స్ వేదికను అందించిన కిషోర్ తాటికొండ (Kishore Tatikonda) కు ప్రత్యేక ధన్యవాదాలను, కిరణ్ చుక్కపల్లికి, నాయకత్వ బృందాలకు, నిర్వాహకులకు, వాలంటీర్లకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected