Connect with us

Conference

ముగిసిన TTA Convention ఆహ్వాన పరంపర; హరీష్ రావు, కొరటాల శివ, శ్రీకాంత్, బండి సంజయ్, పొన్నాల, టీవీ 9 రజనీకాంత్ లకు ఆహ్వానం

Published

on

TTA మెగా కన్వెన్షన్ (Telangana American Telugu Association Mega Convention) ఆహ్వాన పరంపర కొనసాగుతుంది. TTA నాయకులు ఇప్పటికే రాయకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు పెద్దలను ఆహ్వానించిన సంగతి రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ ఆహ్వాన పర్వం ముగింపులో భాగంగా మరికొందరు ప్రముఖులను ఆహ్వానించి అమెరికా కి తిరుగు ప్రయాణం కట్టారు.

TRS సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Thaneeru Harish Rao), ఫేమస్ సినీ దర్శకులు కొరటాల శివ (Koratala Siva), టాలీవుడ్ నటులు శ్రీకాంత్, బీజేపీ నేత బండి సంజయ్, టీవీ 9 రజనీకాంత్ (Rajinikanth Vellalacheruvu), మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) తదితరులను ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు.

ఈ TTA మెగా కన్వెన్షన్ ఆహ్వాన ప్రతులను అందించే కార్యక్రమాలలో టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, రీజినల్ అడ్వైజర్ డా. ద్వారకానాధ్ రెడ్డి, సీఈసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ LN రెడ్డి దొంతిరెడ్డి, నవీన్‌ గోలి తదితర TTA నాయకులు పాల్గొన్నారు.

దీంతో TTA మెగా కన్వెన్షన్ ఆహ్వాన ప్రక్రియ ఘనంగా ముగిసినట్లయింది. ఇంకో పక్క 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ (Seattle) మహానగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహణకు గ్రాండ్ గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

TA లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి మార్గదర్శకత్వంలో అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla), కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది సారధ్యంలో కన్వెన్షన్ ఏర్పాట్లు సాగుతున్నాయి. TTA Mega Convention కి సంబంధించిన మరిన్ని వివరాలకు www.TTAConvention.org ని సందర్శించండి.

కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ
డా. పైళ్ల మల్లారెడ్డి
డా. విజయపాల్ రెడ్డి
డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ
భరత్ రెడ్డి మాదాడి
వంశీ రెడ్డి కంచరకుంట్ల

కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
వంశీ రెడ్డి కంచరకుంట్ల
చంద్రసేన శ్రీరామోజు
నవీన్ రెడ్డి మల్లిపెద్ది
గణేష్ మాధవ్ వీరమనేని
మాణిక్యం తుక్కాపురం
మనోహర్ బాదుకే
డా. నరసింహా రెడ్డి దొంతిరెడ్డి
కవితా రెడ్డి
సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి
డా. దివాకర్ జంధ్యం
శివా రెడ్డి కొల్ల
ప్రదీప్ మెట్టు
ప్రసాద్ కునారపు
సురేష్ రెడ్డి వెంకన్నగారి
ఉషా రెడ్డి మన్నెం

కన్వెన్షన్ రీజినల్ అడ్వైజర్స్
నవీన్ గోలి
మనోజ్ చింతిరెడ్డి
అనీల్ ఎర్రబెల్లి
డా. ద్వారకానాథ్ రెడ్డి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected