Connect with us

Sports

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ & TTA ఆధ్వర్యంలో ఘనంగా ప్రభాకర్ రెడ్డి పుట్టా మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్

Published

on

Cumming, Georgia: గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA) సంయుక్త ఆధ్వర్యంలో ప్రభాకర్ రెడ్డి పుట్టా మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ ఆగస్టు 23, 2026న కమ్మింగ్‌లోని ఫౌలర్ పార్క్లో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.

టెన్నిస్ (Tennis) క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు, క్రీడా స్ఫూర్తి, స్నేహభావం మరియు కమ్యూనిటీ ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ క్రీడా వేడుకలో అట్లాంటా మెట్రో (Metro Atlanta) ప్రాంతానికి చెందిన పలువురు టెన్నిస్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా, అనుభవజ్ఞులైన క్రీడాకారులతో పాటు యువత కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి మ్యాచ్‌లోనూ క్రీడాకారులు (Athletes) అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ విజయం కోసం పోరాడారు. కోర్టులో హోరాహోరీ పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రత్యేకంగా 10 సంవత్సరాల వయస్సు పైబడిన పిల్లలకు కూడా పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా చిన్నారుల్లో టెన్నిస్‌పై (Tennis) ఆసక్తిని పెంపొందించే ప్రయత్నం చేశారు. పిల్లలు, యువత, పెద్దలు కలిసి పాల్గొనడం ఈ టోర్నమెంట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభాకర్ రెడ్డి పుట్టా గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ, క్రీడల (Sports) ద్వారా కమ్యూనిటీని మరింత దగ్గర చేయాలనే సందేశాన్ని నిర్వాహకులు చాటిచెప్పారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, వ్యక్తుల మధ్య స్నేహం, సహకారం, పరస్పర పరిచయాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా GATeS అధ్యక్షులు రమణ గండ్ర (Ramana Gandra), బోర్డ్ చైర్మన్ జ్యోత్స్న పాలకుర్తి (Jyothsna Palakurthy), వైస్ ప్రెసిడెంట్ కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ల, జనరల్ సెక్రటరీ రఘువీర్ రెడ్డి, ట్రెజరర్ రామకృష్ణ గండ్ర, స్పోర్ట్స్ సెక్రటరీ మధుకర్ రెడ్డి (Madhukar Reddy) తదితరులతో పాటు GATeS కార్యవర్గ సభ్యులు కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

అలాగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతినిధులు స్వాతి చెన్నూరి (Swathi Chennuri), ప్రభాకర్ మదుపతి (Prabhakar Madupathi), టెన్నిస్ క్రీడాకారులు, కుటుంబ సభ్యులు, వాలంటీర్లు మరియు కమ్యూనిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.

క్రీడలు – ఆరోగ్యం – స్నేహం – కమ్యూనిటీ ఐక్యత అనే లక్ష్యంతో నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి పుట్టా మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ (Tennis Tournament) విజయవంతంగా ముగియడంతో, భవిష్యత్తులో కూడా మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు GATeS మరియు TTA కృషి చేస్తాయని నిర్వాహకులు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected