Connect with us

Health

New Jersey, Edison: నాట్స్ & సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం, విరివిగా వినియోగించుకున్న ప్రవాసులు

Published

on

Edison, New Jersey, May 30, 2026: “భాషే రమ్యం… సేవే గమ్యం” అనే నినాదంతో అమెరికాలోని ప్రవాస తెలుగు వారికి నిరంతరం అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఆధ్యాత్మిక, సామాజిక సేవలలో ముందుండే ‘సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ సంయుక్తంగా ఎడిసన్ నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.

ఎడిసన్ లోని ఓక్‌ట్రీ రోడ్‌ (Oak Tree Road) లో గల సాయి దత్త పీఠం ప్రాంగణంలో ఈ శిబిరం కొనసాగింది. స్థానిక ప్రవాస తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేని వారు, వృద్ధులు, భారతదేశం (India) నుండి తాత్కాలికంగా అమెరికా (USA) పర్యటనకు వచ్చిన తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వైద్య శిబిరంలో అమెరికాలోని ప్రముఖ తెలుగు వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు (Medical Tests) నిర్వహించారు. అమూల్యమైన సలహాలను అందించారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డా. జనార్ధన్ బొల్లు జీర్ణక్రియ, కాలేయం, పొట్టకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా రోగులను పరీక్షించారు.

ఫ్యామిలీ మెడిసిన్ నిపుణులు డా. స్మిత గుబ్బి సాధారణ ఆరోగ్య సమస్యలపై రోగులకు తగిన దిశానిర్దేశం చేశారు. అలాగే నర్స్ ప్రాక్టీషనర్ బీనా లోపెజ్ రోగుల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్, కౌన్సిలింగ్‌లో కీలక సేవలందించారు. ఈ శిబిరానికి ట్రెంటన్‌ (Trenton) కు చెందిన ‘హామిల్టన్ ఫార్మసీ’ (Hamilton Pharmacy) ప్రత్యేక స్పాన్సర్‌గా వ్యవహరించి తగిన మద్దతును అందించింది.

నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) మార్గదర్శకత్వంలో జరిగిన ఈ శిబిరంలో నాట్స్ నాయకులు బిందు యలమంచిలి (Bindu Yalamanchili), కిరణ్ మందాడి నాట్స్ ఈసి సభ్యుడు, సాయి దత్త పీఠం డైరెక్టర్స్ దాము గేదెల, సుభద్ర పాటిబండ్ల, మురళీ కృష్ణ మేడిచెర్ల (Murali Medicherla) ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ (మీడియా) తదితరులు కీలక పాత్రపోషించి వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.

శ్రీనివాస్ మెంట బోర్డు ఆఫ్ డైరెక్టర్, కిరణ్ మందాడి (Kiran Mandadi) నాట్స్ ఈసి సభ్యుడు, చక్రధర్ వోలేటి, శ్రీకాంత్ పొనకాల, ప్రసాద్ టేకి, శంకర్ జెర్రిపోతుల, జతిన్ కొల్లా, ధర్మ ముమ్ముడి తదితరులు, తెలుగు విద్యార్దులు ఈ వైద్య శిబిరంలో ఎంతో ఉత్సాహంగా తమ సేవలను అందించారు.

సామాజిక బాధ్యతలో బాగంగా విద్యార్ధులు చేసిన సేవలను నాట్స్ (North America Telugu Society – NATS) గుర్తించి వారికి నాట్స్ సేవా సర్టిఫికెట్లను అందించింది. నేరుగా నిపుణులైన డాక్టర్లను కలిసి, ఉచితంగా ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకునే అవకాశం.

కల్పించినందుకు స్థానిక తెలుగు ప్రజలు ‘నాట్స్’ (NATS), ‘సాయి దత్త పీఠం’ (Sai Datta Peetham) సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎడిసన్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతిఒక్కరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla) అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected