తెలుగు ప్రజల ఆశలసౌధం అమరావతి రాజధాని అని వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ (Maryland) లో శ్రీనాథ్ రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు (Mylavaram MLA) వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad), మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా ఎన్టీఆర్ (NTR) చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad) మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం, పోలవరం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం శుభపరిణామం అని అన్నారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సాధ్యం కాదు. ఈ సమయంలో అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సంస్కరణలు చాలా వేగంగా అమలవుతున్నాయి. కూటమి (NDA) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరవేగంగా అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, లోకేష్ మూడు తరాల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కోటిమంది సభ్యులతో పటిష్టంగా ఉందన్నారు. మంత్రి లోకేష్ (Nara Lokesh) చొరవతో రాష్ట్రానికి అనేకరూపాల్లో పెట్టుబడులు వచ్చాయి. తద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని తెలిపారు.
మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఆన్ లైన్ లో నిర్వహించుకోవడం జరుగుతోంది. పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు పూర్తిచేసుకుంది. అభివృద్ధి, సంక్షేమంతో తెలుగుదేశం (TDP) శక్తివంతమైన ప్రజాఉద్యమంగా రూపుదిద్దుకుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాను మాగులూరి (Bhanu Maguluri), చల్లా ప్రభాకర్, నూతక్కి రమేష్, శ్రీనివాస్ దామా, శివనాగ మహేష్ నెలకుదిటి, సతీష్ సూదిరెడ్డి, శివ నెల్లూరి, పైడి శ్రీనివాసరావు, హర్ష పేరంనేని తదితరులు ప్రసంగించారు. పర్సిస్ ఇండియన్ గ్రిల్ (Persis Biryani Indian Grill) రెస్టారెంట్ యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది.