Connect with us

Education

వెంకట్ కోగంటి దాతృత్వం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్

Published

on

తానా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ ‘చేయూత’. ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన తానా చేయూత కార్యక్రమానికి కాలిఫోర్నియా వాసి వెంకట్ కోగంటి స్పాన్సర్ చేసారు.

ఈ చేయూత ప్రాజెక్ట్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్స్ అందించారు. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ చేతుల మీదుగా చెక్స్ పంపిణి జరిగింది. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సెక్రటరీ మరియు చేయూత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శశికాంత్ వల్లేపల్లి నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జనార్దన్ నిమ్మలపూడి, క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected