Connect with us

Education

College Admissions ప్రక్రియపై విలువైన సూచనలు అందించిన తానా స్కాలర్‌షిప్ వెబినార్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం (TANA Mid-Atlantic Chapter) కొత్తగా కాలేజీలో చేరబోయే విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు అలాగే తల్లితండ్రులకు కాలేజీ అడ్మిషన్ల (College Admissions) ప్రక్రియపై విలువైన సూచనలు అందించేందుకు నిర్వహించిన తానా స్కాలర్ షిప్ (Scholarships) వెబినార్ కార్యక్రమం విజయవంతమైంది.

ఇందులో స్కాలర్ షిప్ లకు సంబంధించి విలువైన సూచనలను కూడా తెలియజేశారు. తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు (Venkat Singu), ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకటరావు అడుసుమల్లి అందించిన సహకారం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతమైంది.

ఉన్నత విద్య (Education) అవకాశాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ వెబినార్‌లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళాశాల ప్రవేశాలు, స్కాలర్ షిప్ లను పొందే అవకాశాల గురించి తెలుసుకున్నారు.

అలాగే పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రొఫైల్‌ను ఎలా బలోపేతం చేసుకోవడానికి అవసరమైన వ్యూహాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. అమెరికాలో కాలేజీ దరఖాస్తులకు (College Admissions) ఉపయోగపడే స్కాలర్‌షిప్ గైడ్ ను హాజరైన వారికి తానా నాయకులు (TANA Leaders) అందించారు.

తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) మాట్లాడుతూ.. భవిష్యత్తు విజయాలకు విద్యే బలమైన పునాది అని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా తదుపరి తరాన్ని నడిపించడానికి, వారిని ఉత్తేజితం చేయడానికి మరియు సాధికారత కల్పించడానికి తానా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

తమ నైపుణ్యంతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి విద్యా లక్ష్యాల వైపు ప్రేరేపించిన కాలేజి కౌన్సెలర్, అకడమిక్ కోచ్ జో కేతార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తానా (TANA – Telugu Association of North America) నాయకులు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected