. అమరావతికి చట్టబద్దత కల్పించిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ఎన్నారైలు
. ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతేక ప్రతినిధి కోమటి జయరాం (Komati Jayaram)
. Washington D.C మెట్రో ప్రాంతంలో ఆయనకు ఘన సన్మానం
రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యులు కావాలని ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతేక ప్రతినిధి (AP Special Representative for North America) కోమటి జయరాం పిలుపునిచ్చారు. విద్యా, వైద్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడాలని కోరారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియా లో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధి గా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభ కు భాను మాగులూరి (Bhanu Maguluri) అధ్యక్షత వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ (NTR) చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జయరాం మాట్లాడుతూ అమరావతి (Amaravati)కి చట్టబద్దత కల్పించిన తర్వాత NRIలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురాబోతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), లోకేష్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామికాభివృద్ధికి (Industrial Development) తోడ్పడుతున్నారని తెలిపారు.
తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali) మాట్లాడుతూ అమెరికాలో తెలుగుజాతి ఐక్యత కోసం, అభ్యున్నతి కోసం జయరాం చేసిన కృషి మరువలేనిదని, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ పాఠశాలలో సాంకేతిక విద్య ను అందించడానికి డిజిటల్ లాబరేటరీ ఏర్పాటుచేశారని గుర్తుచేశారు.
గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ.. తానా అధ్యక్షులుగా, NRI టీడీపీ కో-ఆర్డినేటర్ గా, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి గా ఆయన అందించిన సేవలు మరుపురానివని కొనియాడారు.
అమెరికాలో ఉన్న తెలుగు వారికి అండగా నిలబడి వారి సమస్యల పరిష్కరంలో భాగస్వామిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో USA బీజేపీ అధ్యక్షులు ప్రసాద్ అడపా (Prasad Adapa) మాట్లాడుతూ.. అమెరికాలో భారతీయులు ఎక్కువసంఖ్యలో నివసిస్తున్నారు. వారి ప్రయోజనాలు కాపాడటానికి జయరాం ముందువరసలో నిలవాలన్నారు.
జనసేన పార్టీ (Jana Sena Party – JSP) ప్రతినిధులు విజయ్ గుడిసేవ (Vijay Gudiseva), వేణు పులిగుజ్జు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ మైత్రి, రాష్ట్ర ప్రగతి ఇక ముందూ కొనసాగాలన్నారు. టీడీపీ ప్రతినిధులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, ప్రవాస సంఘాల పెద్దలకు అభినందనలు తెలిపారు.
ప్రవాస సంస్థ ఆటా ప్రతినిధులు కవిత చల్లా GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి, సాయిసుధా పాలడుగు, సతీష్ చింత, సత్యనారాయణ మన్నె (Satyanarayana Manne), త్రిలోక్ కంతేటి, కృష్ణప్రియ అడుసుమిల్లి, కంచర్ల కిషోర్, పద్మజ బేవర, నాగ్ నెల్లూరి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.