Connect with us

News

అమెరికాలో మొదటిసారి అట్లాంటా నడిబొడ్డున NTR విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు

Published

on

అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా మహానగరంలో ఎన్టీఆర్ (NTR) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఎన్టీఆర్ జన్మించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, శతజయంతి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా వారు ఈ మహత్కార్యానికి పూనుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఇండియాలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తయారుచేపిస్తున్నారు.

అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో రారాజు అయిన ఎన్టీఆర్‌ (Nandamuri Taraka Ramarao) ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా NTR Trust Atlanta ఆధ్వర్యంలో శకపురుషుని శతజయంతి వేడుకలు మే 13, శనివారం రోజు సాయంత్రం 4 గంటల నుండి స్థానిక లాంబర్ట్ ఉన్నత పాఠశాల (Lambert High School) లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకల అనంతరం ఇండియాలో ఎన్టీఆర్ విగ్రహం సిద్ధం అవ్వగానే అట్లాంటా కి షిప్పింగ్ చేపిస్తారు. అనంతరం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. ఇప్పటి వరకు కాలిఫోర్నియాలో ఒకరు తమ ఇంట్లోనే కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక సంస్థ (NTR Trust Atlanta) తరపున ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ గావించడం అమెరికాలో ఇదే మొట్టమొదటిసారి కానుండడం విశేషం.

అట్లాంటా మహానగరంలో 2008 లోనే NTR Trust స్థాపించి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, అన్న స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజు వేడుకల (Centennial Birthday Celebrations) నిర్వహణతోపాటు విగ్రహ ఆవిష్కరణ మరొక ఎత్తు అవ్వనుంది.

error: NRI2NRI.COM copyright content is protected