. నెదర్లాండ్స్ (Netherlands) లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి
. తెలుగు భాషకు, జాతికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడిన మన్నవ సుబ్బారావు
. భౌగోళిక సరిహద్దులు భాషకు బంధనాలు కావు
నెదర్లాండ్స్ (Netherlands) లో ఆమ్‌స్టర్‌డామ్ (Amsterdam) లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ ఎన్ఆర్ఐ తెదేపా (NRI TDP Netherlands) కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట సమన్వయపరిచారు.
ఈ సందర్బంగా గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) మాట్లాడుతూ.. ఒక జాతి అస్తిస్త్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషే అని ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) గుర్తించి తెలుగును ను ప్రోత్సహించారు.
యూరప్ (Europe) లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఎన్టీఆర్ (NTR) ఆశయాలకు అనుగుణంగా వారిపిల్లలను అమెరికా లో ని సిలికానాంధ్ర వారి తోడ్పాటుతో చక్కటి తెలుగు (Telugu) నేర్పిస్తున్నారు. మాతృభూమికి దూరమైన మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు.
నెదర్లాండ్స్ (Netherlands) లో మనబడి ద్వారా 25 మంది వాలంటరీలుగా ఏర్పడి వారానికి రెండు రోజులు నాలుగు గంటలపాటు రెండువందల యాబై మంది కి తెలుగును నేర్పించడం గర్వకారణం. మాతృభాషను కంటికి రెప్పలా కాపాడుకొంటూ ఐరోపా (Europe) ఖండంలో తెలుగు వెలుగుల్ని విరజిమ్ముతున్న తెలుగు వారందరి అభినందలు తెలియచేసారు.
సంపత్ ఐనంపూడి మాట్లాడుతూ.. మా పిల్లలు తెలుగు భాష (Telugu Language) తో పాటు స్కూళ్లలో డచ్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర భాషలను కూడా నేర్చుకుంటారని తెలిపారు. భౌగోళిక సరిహద్దులు భాషకు బంధనాలు కావని మా పిల్లలు నిరూపిస్తున్నారని తెలిపారు. భాష సాంస్కృతిక వారధి, అలాంటి వారసత్వ సంపదను పదిలంగా ఉంచుకుంటున్నామన్నారు.
అనంతరం సిలికానాంధ్ర (Silicon Andhra Manabadi) ఆధ్వర్యంలో నడుస్తున్న మనబడి బోధనా కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ NRI టీడీపీ అధ్యక్షులు (NRI TDP Netherlands) వివేక్ కరియావుల, ఆచంట గోపాలరావు, సత్యనారాయణ సలకి, అమర్ చంద్ రావి, వివేక్ కరిఆవుల, ప్రసాద్ రామినేని, పవన్ గుమ్మడి , ప్రవీణ్ ముమ్మినేని, చైతన్య వెల్లంకి, నవీన్ పరుచూరి, ఫణీష్ పోతురాజు, నంద ఉదయగిరి తదితరులు పాల్గొన్నారు.