Connect with us

Convention

ఆంధ్రుల చేత ఆంధ్రుల కొరకు AAA మొట్టమొదటి Convention రిజిస్ట్రేషన్ ఓపెన్

Published

on

. ఆంధ్రుల చేత, ఆంధ్రుల కొరకు, ఆంధ్రులే స్థాపించిన AAA
. పెన్సిల్వేనియా లో పురుడు పోసుకున్న AAA
. అతి తక్కువ సమయంలో 18 కి పైగా రాష్ట్రాలలో శాఖల ఏర్పాటు
. 2025 మార్చి 28, 29 తేదీలలో మొట్టమొదటి కన్వెన్షన్ కి సన్నాహాలు
. మార్చి 28 బాంక్వెట్ డిన్నర్ కి వైవిధ్యంగా టికెట్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్
. సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల రేట్లు
. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు
. ఆన్లైన్ లోనే స్టేజీకి ముందు ఫిక్స్డ్ సీటింగ్ సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు
. మార్చి 29 మెయిన్ కన్వెన్షన్ ఈవెంట్ కి కూడా రెజిస్ట్రేషన్ ఓపెన్
. చకచకా ఏర్పాట్లు చేస్తున్న AAA జాతీయ నాయకత్వం

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం (Democracy) అంటారు. అలాగే అమెరికాలో ఆంధ్రుల చేత, ఆంధ్రుల కొరకు, ఆంధ్రులే స్థాపించిన మొట్టమొదటి మరియు ఏకైక జాతీయ స్థాయి తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA).

AAA అంటూ పేరులోనే వైవిధ్యాన్ని పుణికిపుచ్చుకొని, పెన్సిల్వేనియా (Pennsylvania) లో పురుడు పోసుకొని, అతి తక్కువ సమయంలో 18 కి పైగా రాష్ట్రాలలో శాఖలను (Chapters) ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతుంది AAA. ఈ విషయంలో మాత్రం ఫౌండర్ హరి మోటుపల్లి (Hari Motupalli) ని తప్పకుండా అభినందించాల్సిందే.

ఇంతలోనే 2025 మార్చి 28, 29 తేదీలలో మొట్టమొదటి కన్వెన్షన్ (AAA 1st Convention) అంటూ అంచనాలు పెంచేశారు. పెన్సిల్వేనియా లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న AAA మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ కి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మార్చి 28 శుక్రవారం బాంక్వెట్ డిన్నర్ (Convention Banquet Dinner) కి వైవిధ్యంగా టికెట్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారు. సుప్రీమ్ ($15K), ఎలైట్ ($12K), ప్రీమియం ($10K) అంటూ 3 రకాల రేట్లతో వివిధ రకాల స్పాన్సర్షిప్ బెనిఫిట్స్ (Sponsorship Benefits) ఇస్తూ టేబుళ్ల వారీగా టికెట్స్ అమ్ముతున్నారు.

స్టేజీకి ముందు ఫిక్స్డ్ సీటింగ్ ప్రకారం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారే ఆన్లైన్ లో ముందే సెలెక్ట్ చేసుకునేలా బుకింగ్ ఏర్పాటు చేయడం సరికొత్త ఆలోచన. అలాగే సెలెబ్రిటీలు (Celebrities) మరియు స్టార్స్ (Stars) అందరికీ అందుబాటులో ఉండేలా టేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ బాంక్వెట్ స్టైల్ సీటింగ్ ఏర్పాటు చేయడం ప్రత్యేకత అనే చెప్పుకోవాలి.

ఈ రకమైన కన్వెన్షన్ (Convention) రెజిస్ట్రేషన్ ఏర్పాట్లు ఇప్పటి వరకు అమెరికా మొత్తం మీద ఏ తెలుగు సంఘం కూడా చేయలేదు అని చెప్తున్నారు ప్రవాసులు. దీనికి సంబంధించి AAA జాతీయ నాయకత్వం పక్కా ప్రణాళికా బద్దంగా (Strategic Planning) పనిచేసినట్లు తెలుస్తుంది. ఇక పొతే మార్చి 29 శనివారం రోజున నిర్వహించే మెయిన్ కన్వెన్షన్ ఈవెంట్ కి కూడా వీరికి అదే తరహాలో యాక్సెస్ ఉంటుంది.

అంతే కాకుండా కన్వెన్షన్ కార్యక్రమాలు అన్నింటికీ ప్రవేశం ఉండేలా జనరల్ ఈవెంట్ టికెట్స్ (Convention Day 2) కూడా ఓపెన్ చేశారు. 5 సంవత్సరాలు మరియు ఆపై వయస్కులకు $50 నామమాత్రపు ధరకి (Nominal Price) ఈ జనరల్ టికెట్స్ ఓపెన్ చేశారు. వీరిలో AAA సభ్యత్వం (Membership) ఉన్నవారికి ఉచిత భోజనం అందించడం మరో ప్రత్యేకత.

మరింకెందుకు ఆలస్యం! ఈ క్రింది లింకుల ద్వారా కన్వెన్షన్ (Convention) బాంక్వెట్ డిన్నర్ మరియు మెయిన్ కన్వెన్షన్ ఈవెంట్ డే 2 కి త్వరగా మీ రెజిస్ట్రేషన్ పూర్తిచేసుకోండి.
Convention Banquet: https://nationalconvention1.theaaa.org/banquet-seats
Convention Day 2: https://nationalconvention1.theaaa.org/event-registration.html
AAA Membership: https://www.theaaa.org/global/member-registration

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) మొట్టమొదటి కన్వెన్షన్ (Convention) బాంక్వెట్ టేబుల్ బుకింగ్స్ కి సంబంధించి మరిన్ని వివరాలకు సురేష్ కాగితపు (610-823-5012) లేదా రవి చిక్కాల (484-280-4610) లను సంప్రదించండి.