Charlotte, North Carolina: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) గోల్డెన్ జూబ్లి వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పర్యావరణ, పరిశుభ్రత, పరిరక్షణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తానా చేపట్టింది. అందులో భాగంగా చార్లెట్ (Charlotte, North Carolina) నగరంలో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అడాప్ట్ స్ట్రీట్ (Adopt A Street) కార్యక్రమం, ‘గుడ్ నేబర్ డే’ వేడుకల్లో ఛార్లెట్ లోని తానా నాయకులతోపాటు 50మంది పిల్లలు, 50మంది తల్లితండ్రులు హాజరుకావడం విశేషం.
ఈ కార్యక్రమంలో భాగంగా చార్లెట్ నగరంలోని Ardrey Kell & Tom Short కూడలిలోని ఇరువైపుల రహదారులను తానా ప్రతినిధులు దత్తత తీసుకున్నారు. ఛార్లెట్ హౌజింగ్, నైబర్ హుడ్ సర్వీసెస్ అధికారి జొనధన్ హిల్ ఈ కార్యక్రమంలో పాల్గొని తానా నాయకులకు తగిన సూచనలు చేశారు.
వారు చేస్తున్న సేవను అభినందించారు. ఈ సందర్భంగా తానా (Telugu Association of North America – TANA)దత్తత తీసుకున్న రోడ్లపై తానా బోర్డ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రహదారుల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ ఉదయం అల్పాహారం, కాఫీ, టీలను అందించారు.
తానా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని (Adopt A Street) ఛార్లెట్ సిటీ కౌన్సిల్ మెంబర్ ఎట్ లార్జ్ డింపుల్ అజ్మీరా అభినందించారు. తానా చేస్తున్న ఈ సేవా కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. తానా నాయకులకు (TANA Leaders) ఆమె అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Dr. Naren Kodali) మాట్లాడారు. తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టామని అంటూ, ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఆయన అభినందించారు.
తానా ఇవిపి శ్రీనివాస్ లావు (Srinivas Lavu), కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) కూడా అభినందించారు. ఛార్లెట్ లోని తానా నాయకులు నాగ పంచుమర్తి (Naga Panchumarthi), ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.