Connect with us

Community Service

NATS @ Dallas, Texas: అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమంలో భాగంగా పార్క్ పరిశుభ్రతలో ఉత్సాహంగా పాల్గొన్న యువత

Published

on

Dallas, Texas, September 28, 2026: భాష రమ్యం సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, సేవాభావాన్ని పెంచేలా అడాప్ట్ ఎ పార్క్ (Adopt A Park) కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది.

ఫ్రిస్కో (Frisco) నగరంలోని ‘మొనార్క్ వ్యూ పార్క్’ (Monarch View Park) వేదికగా నిర్వహించిన ‘అడాప్ట్ ఎ పార్క్’ లో విద్యార్థులు, నాట్స్ సభ్యులు పాల్గొన్నారు.
‘సిటీ ఆఫ్ ఫ్రిస్కో’ భాగస్వామ్యంతో మొనార్క్ వ్యూ పార్క్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, పార్క్ నిర్వహణను మెరుగుపరిచేందుకు నాట్స్ ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే జరిగిన ఈ తాజా కార్యక్రమంలో స్థానిక తెలుగు వారు ముఖ్యంగా ఇరవై మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాలుపంచుకుని పార్క్ పరిసరాలను శుభ్రపరిచారు. చిన్ననాటి నుంచే పిల్లలలో సేవా దృక్పథం, సామాజిక బాధ్యత (Social Responsibility), పర్యావరణ స్పృహ (Environmental Consciousness) పెంపొందించేలా నాట్స్ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం స్థానికుల నుంచి ఎంతో ప్రశంసలు అందుకుంది.

ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు (NATS Dallas Chapter Coordinators) కిరణ్ నారె (Kiran Nare), పావని నున్న (Pavani Nunna) తోపాటు డల్లాస్ బృందం సభ్యులు బదరి బియ్యపు (Badari Biyyapu), నరేన్ శివ (Naren Siva), హృదయ్ దండు (Hriday Dandu), రోహిత్ సుంకర (Rohit Sunkara), రవి తాండ్ర (Ravi Taandra), విశాలాక్షి నారె (Visaalakshi Nare), దీపిక నిడిగంటి (Deepika Nidiganti) తదితరులు పాల్గొన్నారు.

అలాగే డల్లాస్ చాప్టర్ యూత్ జట్టు నుండి ధృవ్ పెదిరెడ్ల, వేద నిడిగంటి, అద్వైత్ నారె, అర్ణవ్ నారె తదితరులు ఉత్సాహంగా శ్రమదానం చేశారు. మరోవైపు, నాట్స్ జాతీయ నాయకత్వం (NATA National Leadership) నుంచి జోనల్ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ సెట్టిపల్లి (Ratnakar Settipalli), నేషనల్ మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ శ్రవణ్ నిడిగంటి (Sravan Nidiganti), ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ కిషోర్ నారె (Kishore Nare) లు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వయంగా పర్యవేక్షించారు.

ఫ్రిస్కో నగరంలో ‘అడాప్ట్ ఎ పార్క్’ కార్యక్రమాన్ని నిరంతరం విజయవంతంగా కొనసాగిస్తూ, కమ్యూనిటీ సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటున్న నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టును నాట్స్ బోర్డ్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ (Raj Allada) ప్రత్యేకంగా అభినందించారు.

రానున్న రోజుల్లో డల్లాస్ (Dallas, Texas) పరిసర ప్రాంతాల్లోని చిన్నారులు యువతను మరింత పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ మరిన్ని విస్తృత సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు కిరణ్ నారె, పావని నున్న వెల్లడించారు.

ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్‌ (Volunteers) కు, పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు నాట్స్ నాయకత్వం (North America Telugu Society – NATS Leadership) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

error: NRI2NRI.COM copyright content is protected