విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవాలు Birmingham, Alabama, USA లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, అన్న ఎన్టీఆర్ గారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రతీ సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లే, వరుసగా 4వ సంవత్సరం కూడా అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం (Food Donation Drive) The Jimmie Hale Mission, Homeless Shelter, Birmingham, Alabama లో నిర్వహించారు.
“పేదవారికి పట్టెడన్నం పెట్టాలి” అనే అన్నగారి (Nandamuri Taraka Rama Rao – NTR) ఆశయాన్ని కొనసాగిస్తూ, అవసరమైన వారికి భోజనం అందించడం ద్వారా బర్మింగ్హామ్ (Birmingham, Alabama) లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, స్వయంగా వంట చేయడం (Cooking) మరియు భోజనం వడ్డించడం (Serving) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు సేవా భావంతో ముందుకు వచ్చి నిరాశ్రయులకు ఆత్మీయంగా భోజనం అందించడం అందరినీ ఆకట్టుకుంది.
అదేవిధంగా, భావితరాలకు ఎన్టీఆర్ (NTR) గారి గొప్పతనం, సేవా స్పూర్తి మరియు సంస్కారాలను చేరవేసే ఉద్దేశంతో బాలలకు చిత్రలేఖనం (Painting) మరియు ప్రసంగ పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం, తెలుగు జాతికి చేసిన సేవలు, అలాగే అవసరంలో ఉన్న వారికి ఆహారం పంచడం యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా మాట్లాడారు.
ఈ కార్యక్రమం ద్వారా మన సంప్రదాయాలను, సేవా భావాన్ని (Service Motive) భావితరాలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. పిల్లల్లో సేవా దృక్పథాన్ని పెంపొందిస్తూ, ఎన్టీఆర్ (NTR) గారి ఆశయాలను తదుపరి తరాలకు తీసుకెళ్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందించారు.
చివరగా, ఈ నటసార్వభౌముని 103వ జయంతి ఉత్సవాల నీరాజనం, అన్నదానం కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ, బాల బాలికలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు (Parents) మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.