Connect with us

Politics

AP మాజీ ముఖ్యమంత్రి, YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డిని మహాసభలకు ఆహ్వానించిన ATA ప్రతినిధులు

Published

on

Amaravati, Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA ప్రతినిధులు. అమరావతిలో కలిసి బాల్టిమోర్ మేరీల్యాండ్ రాష్ట్రములో జరుగుతున్న 19వ ATA మహాసభలకు రావలసిందిగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జగన్ (YS Jagan Mohan Reddy) ప్రవాస తెలుగు వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల (Telugu States) నుండి ప్రముఖ నాయకులూ, సినీ రంగ ప్రముఖులు, కళాకారులూ పాల్గొంటున్న ఈ మహాసభలకు వైసీపీ (YSRCP) ప్రతినిధులని పంపించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు సుముఖత వ్యక్తపరిచారు.

ఆటా మహాసభలని (Conference & Youth Convention) విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆటా వారికి సహకరించాలని వైసీపీ (YSRCP) సమనవ్యయ కర్త సజ్జల రామకృష్ణ రెడ్డి (Sajjala Ramakrishna Reddy) కార్యదర్శి సాంబశివ రెడ్డి లని ఆదేశించారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) ప్రతినిధులు ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), పూర్వాధ్యక్షులు భువనేశ్ బుజాల (Bhuvanesh Boojala), శరత్ వేముల (Sarath Vemula), శ్రీకాంత్ గుడిపాటి (Srikanth Gudipati) తదితరులు జగన్ గారిని కలిశారు.

error: NRI2NRI.COM copyright content is protected