Connect with us

Telugu Desam Party

NRI TDP Chicago ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి & మహానాడు వేడుకలు

Published

on

Chicago, Illinois: ఎన్ఆర్ఐ టిడిపి చికాగో ఆధ్వర్యంలో, సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ హేమ కానూరు గారి పర్యవేక్షణలో చికాగోలోని కానూరు ఫార్మ్ హౌస్‌ (Kanuru Farm House) లో శ్రీ ఎన్టీఆర్ జయంతి మరియు మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు హాజరై అన్నగారి సేవలను, చిరస్మరణీయ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్ శ్రీ కోమటి జయరాం (Jayaram Komati) గారు, పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడె ప్రసాద్ (Bode Prasad) గారు, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమా (Devineni Uma Maheswara Rao) గారు జూమ్ కాల్ ద్వారా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం మరియు అభివృద్ధి కోసం శ్రీ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారు చేసిన విశిష్ట సేవలను వారు కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్లు, పార్టీ నాయకులు కూడా మాట్లాడి ఎన్టీఆర్ (NTR) గారితో తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ హేమ కానూరు (Hema Kanuru) గారు మరియు ఎన్ఆర్ఐ టిడిపి చికాగో అధ్యక్షుడు రవి కాకర (Ravi Kakara) గారు ప్రసంగించి సభకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

చివరగా కేక్ కట్టింగ్ కార్యక్రమంతో ఎన్ఆర్ఐ టిడిపి చికాగో (NRI TDP Chicago) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) జయంతి, మహానాడు (Mahanadu) వేడుకలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.

error: NRI2NRI.COM copyright content is protected