New Jersey, Edison, May 25, 2026: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి. మాధవి కొల్లి గారికి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (OFBJP USA) ఆధ్వర్యంలో ఎడిసన్, న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ (Royal Albert’s Palace) లో ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్లు హాజరై ఆమెను ఆత్మీయంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి. మాధవి కొల్లి గారు పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను పంచుకున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో కర్యకర్తలతో కలిసి పనిచేసిన విధానాన్ని వివరిస్తూ, ప్రజలు గత ప్రభుత్వంపై విసుగుచెంది మార్పు కోసం బీజేపీ (Bharatiya Janata Party – BJP) కి అవకాశం ఇచ్చారని తెలిపారు.
బీజేపీ విజయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారి నాయకత్వం, హోం మంత్రి శ్రీ అమిత్ షా (Amit Shah) గారి మార్గదర్శకం, పార్టీ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారి కృషి ప్రధాన కారణమని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీల పాలనపై నిరాశ చెందారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (Overseas Friends of BJP – OFBJP USA) అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ మాట్లాడుతూ, “తెలంగాణలో వచ్చే దక్షిణ భారత బీజేపీ ప్రభుత్వం ఏర్పడే రాష్ట్రం అవుతుంది” అని అన్నారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ (Congress) ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, 2028లో ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్కు అవకాశం ఇస్తారని తెలిపారు.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (Overseas Friends of BJP – OFBJP USA) ప్రధాన కార్యదర్శి శ్రీ వాసుదేవ్ పటేల్ (Vasu Patel) మాట్లాడుతూ, బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన అనుబంధం కలిగిన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (OFBJP-USA) తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల (Vilas Reddy Jambula) మాట్లాడుతూ మాధవి కొల్లి గారి అమెరికా పర్యటన విశేషాలను వివరించారు. బీజేపీ సంవత్సరాలుగా ఎలా బలోపేతం అయిందో తెలియజేస్తూ, 2028లో తెలంగాణలో కూడా బీజేపీ విజయపథంలో ముందుకు సాగుతుందని అన్నారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాయని విమర్శించారు.
ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ రాజ్ గారు ఇటీవల మలక్పేట్కు చెందిన కర్యకర్త కరుణాకర్ మృతికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి (Krishna Reddy Anugula), సంతోష్ రెడ్డి (Santosh Reddy Koram), గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, కృష్ణ మోహన్, ప్రసాద్, రాంరెడ్డి వేముల, రాజవర్ధన్ తదితర ప్రముఖులు, కమ్యూనిటీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.