Hyderabad, Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు కలిశారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్ లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
ఆటా చేపట్టే కార్యక్రమాలను ఈ సందర్భంగా సీఎం (Chief Minister) కు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా (Jayanth Challa). యుఎస్ ఆటా భాగస్వామ్యం తో నిర్వహించే ఈ మహా సభల్లో అమెరికా స్థానిక గవర్నర్ లు, పలువురు నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ NRI లు దత్తత అంశంపై నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల (Sarath Vemula) సీఎంకు వివరించారు. సీఎం హోదాలో ATA సభలకు హాజరు కావాలని కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) సానుకూలంగా స్పందించారు.
సీఎం ని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా (Eshwar Reddy Banda), ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.