Bay Area, California: అజరామరం అమరావతి రాజధాని అని మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు కొనియాడారు. బే ఏరియా మిల్పిటాస్ పట్టణం లో 4/3/2026 శుక్రవారం నాడు చట్టబద్దమైన రాజధానిగా అమరావతి ఏర్పడటం పట్ల NRI లు ప్లక్కార్డ్స తో ప్రదర్శన జరిపి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రతేక ప్రతినిధి కోమటిజయరాం (Komati Jayaram) పిలుపు మేరకు అమరావతి రాజధాని చట్ట బద్ధత పై అమెరికా వ్యాప్తంగా NRI లు అందరూ పండుగ వాతావరం లో ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్బంగా మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) మాట్లాడుతూ, అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అని తెలిపారు. అమరావతి ఉద్యమానికి సరికొత్త నిర్వచనం చెప్పి అమరావతి రైతులు చరిత్ర సృష్టించారు. ప్రభుత్వాలు (Government) మారినప్పుడల్లా రాజధాని మార్చడం సాధ్యంకాదు అని … పార్లమెంట్ లో చేసిన చట్టం స్పష్టం చేసిందని తెలిపారు.
వెంకట్ కోగంటి (Venkat Koganti) మాట్లాడుతూ, అమరావతికి చట్ట బద్ధత ప్రజా విజయం గా అభివర్ణించారు.రైతుల పోరాటాలకు, త్యాగాలకు ఇది ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. అమరావతే (Amaravathi) రాజధాని అని దేశ వ్యాప్తంగా ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలియచేసారు.
కానీ ఒక్క వైసీపీ పార్టీ (YSR Congress Party) మాత్రం వ్యతిరేకించడం దురదృష్టకరం. జగన్ మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. అమరావతి పై విద్వేషాన్ని , విషాన్ని కక్కుతున్నాడని అన్నారు. బే ఏరియా (Bay Area) లో అమరావతి ఉద్యమానికి మద్దతుగా అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందించామన్నారు.
అమరావతి (Amaravathi) శాశ్వత రాజధానిగా ఏర్పడం ద్వారా తెలుగు ప్రజల కలలు సాకారమయ్యాయి అన్నారు. ఈ కార్యక్రమాన్నీ విజయ్ గుమ్మడి (Vjay Krishna Gummadi) సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీని వల్లూరిపల్లి, బిర్యానీ జంక్షన్ వెంకట్, మోహన్ మల్లెంపాటి, జగదీష్ గింజుపల్లి, భాస్కర్ అన్నే, విజయ్ రెడ్డి జెట్టి పాల్గొన్నారు.
అలాగే శ్రీనివాస్ వట్టికూటి, రాజశేఖర్ పర్వతనేని, సతీష్ అంబటి, తిరుపతిరావు వలివేటి,వీరు ఉప్పాల, రామ్ తోట, రవి కిరణ్ యేలేటి, నరేందర్ రెడ్డి యెన్నంరెడ్డి, రాంబాబు మానుకొండ, కిశోరె తాడికొండ, హరి సన్నిధి, యశస్వి మాధవ, చెంద్రశేఖర్, అనంతరాం, వంశి కందుల, మహేంద్ర కూచిపూడి, మురళి సురం తదితరులు కూడా పాల్గొని విజయవంతం చేశారు.