Connect with us

Convention

జనరంజక కార్యక్రమాలతో 3 రోజుల నాట్స్ సంబరాల పూర్తి షెడ్యూల్ విడుదల, సర్వం సిద్ధం

Published

on

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) న్యూజెర్సీ వేదికగా న్యూ జెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్సపొజిషన్ సెంటర్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే నాట్స్ తెలుగు సంబరాలను అద్భుతంగా జరిపేందుకు సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ సంబరాల కమిటీ సర్వం సిద్ధం చేసింది.

నాట్స్ (NATS) 7వ తెలుగు సంబరాల్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమాలను రోజువారీగా మూడు రోజులపాటు కార్యక్రమాల వివరాలను ప్రకటించింది. ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మణిశర్మ, తమన్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్, సదస్సులు వంటి పలు జనరంజక కార్యక్రమాలు మచ్చుకు ఉన్నాయి.

ఇంకా తెలుగమ్మాయి కార్యక్రమం తుది పోటీలు, అమ్మనాన్నకు సత్కారం పేరిట తల్లిదండ్రులను సంబరాల వేదికపై సత్కరించుకునే కార్యక్రమం వంటి పలు ప్రత్యేక కార్యక్రమాలతో మూడు రోజుల నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల షెడ్యూల్ విడుదల చేశారు. రోజు వారీ పూర్తి వివరాల కోసం ఫ్లయర్స్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected