Connect with us

Competitions

ధీం-తానా విజయ పరంపరను కొనసాగించిన ర్యాలీ నగర పోటీలు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ (TANA) 23వ మహాసభలు ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

తానా మహాసభలకు ముందు ధీం-తానా (DhimTANA) పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే తానా మహాసభలలో (23rd Conference) భాగంగా అట్లాంటాలో గ్రాండ్ గా నిర్వహించిన ధీం-తానా పోటీలు మంచి శుభారంభాన్ని అందించాయి.

ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ మే 21 ఆదివారం రోజున నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరంలో ధీం-తానా పోటీలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముందుగా సోలో సింగింగ్, గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించారు.

అనంతరం మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, చిలకా గోరింకా కపుల్ కాంటెస్ట్ నిర్వహించారు. విజేతలకు మెమెంటోస్, క్రౌన్ అందించారు. తానా కళాశాల గురువుల సేవలకు గుర్తింపుగా వారిని శాలువా మరియు పుష్పగుచ్చంతో సన్మానించారు.

ధీం-తానా ఛైర్ మాలతి నాగభైరవ మరియు ధీం-తానా కమిటీ సభ్యురాలు ప్రియాంక గడ్డం ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. ఈ ప్రాంతీయ పోటీలలో గెలిచిన వారు జులై 7, 8, 9 తేదీలలో తానా మహాసభలలో ఫైనల్స్ లో పాల్గొననున్నారు. పలువురిని వేదిక మీదికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

విజయవంతంగా ముగించిన ర్యాలీ (Raleigh) నగర ధీం-తానా నిర్వాహకులను పోటీలలో పాల్గొన్నవారు అభినందించారు. అలాగే విజేతలు జులై 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న తానా మహాసభల (TANA 23rd Convention) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.

అప్రతిహాతంగా సాగిన ఈ ర్యాలీ నగర ధీం-తానా పోటీల హైలైట్స్ టీవీ9 లో ప్రసారం అవుతాయి. ఈ సందర్భంగా అపలాచియన్ రీజియన్ ధీం-తానా నిర్వాహకులు తానా నాయకులకు, వాలంటీర్లకు, న్యాయ నిర్ణేతలకు, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected