Connect with us

Achievements

TANA Awards for Excellence: పూర్తి వివరాలతో ప్రతిపాదనల స్వీకరణ, జూన్ 10 చివరి తేదీ

Published

on

ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలై 7,8,9వ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్న తానా 23వ మహాసభలను పురస్కరించుకుని, ఉత్తమ ప్రతిభగల వారిని ప్రోత్యహించి అవార్డులతో (TANA Awards for Excellence) ఘనంగా సత్కరించే మహోన్నత కార్యక్రమానికి మహాసభల తానా అవార్డ్స్ కమిటి శ్రీకారం చుట్టింది.

తానా (TANA) అవార్డ్స్ కమిటి వారు విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని “తానా అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్” ఇచ్చి ఘనంగా సత్కరిస్తారు. మీకు అర్హులు అనిపించే వారి పేర్లను ప్రతిపాదించవచ్చు.

వారికి తగిన గౌరవసత్కారాలు దక్కేలాగా సిఫార్సు చేయడానికి వారి పూర్తి వివరాలు ఆంగ్లంలో లేక తెలుగులో క్షుణ్ణంగా వ్రాసి, ఫోటో జతపరిచి awards@tanaconference.org కు ఇమెయిల్ పంపమని కోరుతున్నారు తానా వారు. మీరు ప్రతిపాదించడానికి చివరి గడువు జూన్ 10వ తారీఖు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected